హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Shocking: ఉలిక్కి పడిన నగరం.. జనావాసాల్లో పది రౌండ్ల కాల్పులు జరిపిన ఆగంతకులు..

Shocking: ఉలిక్కి పడిన నగరం.. జనావాసాల్లో పది రౌండ్ల కాల్పులు జరిపిన ఆగంతకులు..

విచారణ చేపట్టిన అధికారులు

విచారణ చేపట్టిన అధికారులు

Delhi: దేశ రాజధాని ఒక్కసారిగా కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. ఆగంతకులు స్థానికంగా ఉన్న సుభాష్ నగర్ లో కాల్పులు జరిపారు. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు.

ఢిల్లీలో  (Delhi) శనివారం గుర్తుతెలియని ఆగంతకులు కాల్పులకు తెగబడ్డాడు. స్థానికంగా ఉన్న సుభాష్ నగర్ ప్రాంతంలో జనావాసాల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగంతకులు పది రౌండ్ల (Firings) వరకు కాల్పులు జరిపారు. దీంతో అక్కడి ప్రజలు భయంతో పరుగులు వేరే ప్రాంతాలకు పరుగులు పెట్టారు. ఈ కాల్పులతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఉన్నతాధికారులు స్పాట్ కు చేరుకున్నారు.

అప్రమత్తమైన అధికారులు అదనపు బలగాలను ఆ ప్రదేశంలో మోహరించారు. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు ఉగ్రవాదులు దాడిజరిపారా.. మరేదైన ఉందా అన్న కోణంలో విచారణ చేపట్టారు. భద్రత బలగాలు అణువణువు గాలిస్తున్నారు. ఆ ప్రాంతాలను తమ ఆధీనంలో తెచ్చుకున్నారు.

కర్ణాటకలో వ్యభిచార దందాను అధికారులు బయటపెట్టారు.

ప్రస్తుతం అనేక చోట్ల కేటుగాళ్లు డబ్బుల ఆశచూపి మహిళలతో, అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సరైన ఆసరాలేక, అవకాశాలు రాక అడ్డదారిలో డబ్బులు సంపాదించడానికి వ్యభిచార కూపంలోకి (Prostitution Rocket) దిగుతున్నారు. నిర్వాహకులు వీరి బలహీనతలను ఆశచూపి, ప్రత్యేక మైన హోటళ్లు, ఇళ్లలు వ్యభిచారానికి ఉపయోగిస్తున్నారు. కొందరు ఇలాంటి పనులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హోటళ్లలో ఒక వైపు రెస్టారెంట్ లను నిర్వహిస్తునే.. మరొవైపు సీక్రెట్ గా వ్యభిచారం నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం సీక్రెట్ గా వ్యభిచారం నిర్వహిస్తున్న విధానం చూసి అధికారులే నోరేళ్లబెట్టారు.

పూర్తి వివరాలు.. కర్ణాటకలోని (karnataka) చిత్రదుర్గలో ఒక హోటల్ లో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హోటల్ పై దాడిచేశారు. హోటల్ అంతా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో టాయ్ లేట్ రూమ్ లో (Secrete toilet room)  కూడా తనిఖీ చేపట్టారు. అక్కడ పోలీసులు ఒక సీక్రెట్ రూమ్ ఉండటాన్ని గమనించారు. దానిలో తొంగి చూస్తే.. అది గదిలా ఉంది. దానిలో కొందరు వ్యక్తులు, అమ్మాయిలు ఉండటాన్ని పోలీసులు గమనించారు. వెంటనే వారిని బయటకు రప్పించారు. ఈ క్రమంలో.. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Delhi, Gun fire

ఉత్తమ కథలు