HOME »NEWS »NATIONAL »2 indian high commission staffers arrested in islamabad released after delhi lodges protest with pakistan sk

భారత్ ఒత్తిడితో దిగొచ్చిన పాక్.. భారత్ హైకమిషన్ సిబ్బంది విడుదల

భారత్ ఒత్తిడితో దిగొచ్చిన పాక్.. భారత్ హైకమిషన్ సిబ్బంది విడుదల
ప్రతీకాత్మక చిత్రం

ఇద్దరు అధికారులను వెంటనే విడుదల చేయాలని పాక్ ప్రభుత్వంపై భారత విదేశాంగ ఒత్తిడి తెచ్చింది. అంతేకాదు వారి కారును కూడా భారత హైకమిషన్‌కు అప్పగించాలని స్పష్టం చేసింది.

  • Share this:
    పాకిస్తాన్‌లో ఇద్దరు భారత్ హైకమిషన్ అధికారుల మిస్సింగ్ తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఐతే వారిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని గూఢచారులకు చిత్రీకరిస్తూ అదుపులోకి తీసుకోవాలని పాకిస్తాన్ భావించినట్లు విశ్వసనీయ వర్గాలు న్యూస్18తో చెప్పాయి. ఐతే పాకిస్తాన్ మీడియా మాత్రం.. వారిద్దరు కారుతో ఓ వ్యక్తిని ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారని కథనాలు ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చార్జ్ డి అఫైర్స్ సయ్యద్ హైదర్ షా‌కు భారత విదేశాంగ నోటీసులు పంపింది. ఆయన భారత అధికారులతో సమావేశమై దీనిపై చర్చించారు.

    తమ ఇద్దరు అధికారులను వెంటనే విడుదల చేయాలని పాక్ ప్రభుత్వంపై భారత విదేశాంగ ఒత్తిడి తెచ్చింది. అంతేకాదు వారి కారును కూడా భారత హైకమిషన్‌కు అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఇరువురు అధికారులను పాకిస్తాన్ పోలీసులు వదలిపెట్టారు. అనంతరం వారు క్షేమంగా భారత హైకమిషన్ కార్యాలయానికి చేరుకున్నట్లు విదేశాంగశాఖ అధికారులు తెలిపారు.





    సోమవారం ఉదయం నుంచి భారత హైకమిషన్ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు CISF అధికారుల ఆచూకీ లభించ లేదు. ఉదయం వారిద్దరు ఇస్లామాబాద్‌లో కార్యాలయ పనులకు బయలుదేరారు, ఆ తర్వాత వారి నుంచి ఎటువంటి సమాచారం రావడం లేదు. రెండు మొబైల్‌ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. ఇదే విషయమై పాకిస్తాన్ అధికారుల్ని భారత్ సంప్రదించింది. భారత్‌లో ఉన్న పాకిస్తాన్ రాయబార కార్యాలయ అధికారులకు నోటీసులు కూడా ఇచ్చింది.

    కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ లో తమ దౌత్యవేత్తలను వేధిస్తున్నారని భారత్ వేలెత్తి చూపింది. అయితే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డిటెక్టివ్ ఒకరు... పాక్ లోని భారత దౌత్యవేత్త గౌరవ్ అహ్లువాలియా కారును వెంబడిస్తున్నట్లు ఇటీవల ఓ వీడియో బయటపడింది. అదే సమయంలో, కొంతమంది అహ్లువాలియా ఇంటి వెలుపల కూడా కనిపించారు.
    భారత రాయబార కార్యాలయాల అధికారులను వేధించిన ఫిర్యాదులపై ఇప్పటికే భారత్ పాకిస్తాన్ విదేశాంగ శాఖకు నోటీసు కూడా ఇచ్చింది. పాకిస్తాన్ తన దౌత్యవేత్తలకు తగిన భద్రత కల్పించాలని భారత ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే.
    Published by:Shiva Kumar Addula
    First published:June 15, 2020, 21:06 IST