హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఏం మాయ చేశాడో : నావాడంటే నావాడంటూ ప్రియుడి కోసం బస్టాండ్ లోనే కొట్టుకున్న ఇద్దరమ్మాయిలు

ఏం మాయ చేశాడో : నావాడంటే నావాడంటూ ప్రియుడి కోసం బస్టాండ్ లోనే కొట్టుకున్న ఇద్దరమ్మాయిలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Two Girls Fight Over Common Boyfriend : ఓ అమ్మాయి(Girl) కోసం.. అబ్బాయిలు(Boys) కొట్టుకోవడం, చంపుకోవడం గురించి విన్నాము, చూశాము. ఆ అమ్మాయి నాకే సొంతం అంటే కాదు నాకే సొంతం అంటూ అబ్బాయిలు ఘర్షణ(Fight) పడటం చూశాము. ఇది కామన్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Two Girls Fight Over Common Boyfriend : ఓ అమ్మాయి(Girl) కోసం.. అబ్బాయిలు(Boys) కొట్టుకోవడం, చంపుకోవడం గురించి విన్నాము, చూశాము. ఆ అమ్మాయి నాకే సొంతం అంటే కాదు నాకే సొంతం అంటూ అబ్బాయిలు ఘర్షణ(Fight) పడటం చూశాము. ఇది కామన్. ఇటీవల రాజస్తాన్ లోని జైపూర్ లో కూడా ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు  గొడవ పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. కథనాల ప్రకారం.. కొన్నేళ్లుగా యువకులిద్దరితో ఒకరికి తెలియకుండా మరొకరితో అమ్మాయి వ్యవహారం నడుపడమే దీనికి కారణం.  అయితే  ఓ అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకోవడం(Two Girls Fight For Common Boyfriend), అదీ  బస్లాండ్ లో అందరి ముందు ఘర్షణకు దిగడం కాస్త అరుదుగా జరిగే ఘటనగానే చెప్పుకోవాలి. బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతులు బస్టాండ్‌లో కొట్టుకున్నా కొట్టుకున్న ఘటన తాజాగా మహారాష్ట్ర(Maharashtra)లోని పైఠాన్‌ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.


పైఠాన్‌ లో నివసించే దాదాపు 17 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు అమ్మాయిలో కొద్ది రోజులుగా ఒకే అబ్బాయిని ప్రేమిస్తున్నారు. తాను ప్రేమించినవాడు తనకే దక్కాలని అతడిని వదులుకునేందుకు ఎవరూ సిద్దంగా లేరు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆ ఇద్దరమ్మాయిలలోని  ఓ అమ్మాయి ప్రియుడితో కలిసి పైఠాన్‌  బస్టాండ్‌కు చేరుకుంది. ఈ విషయం అవతలి యువతికి తెలియడంతో ఆమె కూడా అక్కడికి చేరుకుంది. దీని తర్వాత ఇద్దరు అమ్మాయిల మధ్య ఫైటింగ్ మొదలైంది. ఆ అబ్బాయి తనవాడంటే తనవాడంటూ ఇద్దరు అమ్మాయిలు తిట్టుకున్నారు. అతడు నా ప్రియుడు..అతనిని వదిలెయ్ అంటూ ఒకరినొకరు జుట్టు పట్టుకొని మరీ కొట్టుకున్నారు.ఎంత కష్టమొచ్చెనే : ప్రియుడితో భార్య జంప్..కొడుకుని ఎత్తుకొని తండ్రి రిక్షా సవారీ


గొడవ పెరిగిపోవడంతో చుట్టుపక్కల ఉన్నవారు అందరూ వారినే చూస్తూ నిలబడ్డారు. దీంతో భయపడిపోయిన ప్రియుడు ఆ అమ్మాయిల బారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. అమ్మాయిలు మాత్రం గొడవ పడుతూనే బస్లాండ్ వద్ద ఉండిపోయారు. సమాచారం అందుకోవడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరమ్మాయిలను పోలీస్ స్టేషన్ కు తరలించి  కౌన్సెలింగ్ ఇచ్చి  విడిచిపెట్టారు. మరోసారి ఇలా చేస్తే కేసు నమోదుచేసి జైల్లో పెడతామని హెచ్చరించారు. అయితే, ఆ అమ్మాయిల వివరాలేవి తెలియరాలేదు. కాగా,ఇటీవల తమిళనాడులోని ఓ బస్లాండ్ లో కూడా ఇలాగే ఓ అబ్బాయి కోసం ఇద్దరమ్మాయిలు పడి పడి కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Maharashtra, Viral

ఉత్తమ కథలు