హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

MiG-21 Planes: 400 ప్రమాదాలు.. 200 మంది పైలట్లు మృతి.. ఎయిర్‌ఫోర్స్ నుంచి మిగ్-21ని తప్పిస్తారా?

MiG-21 Planes: 400 ప్రమాదాలు.. 200 మంది పైలట్లు మృతి.. ఎయిర్‌ఫోర్స్ నుంచి మిగ్-21ని తప్పిస్తారా?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

MiG-21... ఫ్లయింగ్ కాఫిన్ , విడో మేకర్ అనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అంటే ఈ ఫ్లైట్‌లో ప్రయాణిస్తే తిరిగిరారనే అపవాదును మూటగట్టుకుంది. ఐనప్పటికీ వీటిని వినియోగిస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

  భారత వాయుసేన (Indian Air Forceలో ఉన్న మిగ్-21 బైసన్ యుద్ధ విమానాల (MiG-21 Bison Fighter Jets) పై ఎప్పటి నుంచో వివాదం ఉంది. కాలం చెల్లిన ఆ విమానాలను.. విరమించుకోవాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. ఈ పాత విమానాలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఎంతో మంది పైలట్లు ప్రాణాలు కోల్పోతున్నాయని.. విపక్షాలతో పాటు రక్షణ రంగ నిపుణులు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఐనప్పటికీ కేంద్ర మాత్రం వాటిని కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి కూడా ఓ ప్రమాదం జరిగింది. బార్మేర్ జిల్లాలో మిగ్-21 బైసన్ ఫైటర్ జెట్ కూలిపోయి.. ఇద్దరు పైలట్లు మరణించారు. గత ఏడాదిన్నర కాలంలో జరిగిన మిగ్ ప్రమాదాల్లో ఇది ఆరవది. అంతకుముందు డిసెంబర్ 2021లో ఓ విమానం కూలిపోయి..పైలట్ మరణించాడు. అంతకుముందు కూడా చాలా ఘటన జరిగాయి.

  Snake in Train: రైలును గంట పాటు ఆపేసిన పాము.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు

  గురువారం జరిగిన ప్రమాదంలో.. ఇద్దరు ఎయిర్ ఫోర్స్ పైలట్లు అక్కడికక్కడే మరణించారు. వారిని వింగ్ కమాండర్ రానా, ఫ్లైట్ లెఫ్టినెంట్ ఆదిత్య బల్‌గా గుర్తించారు. వింగ్ కమాండర్ ఎం. రానా స్వస్థలం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి. ఫ్లైట్ లెఫ్టినెంట్ ఆదిత్య బల్ స్వస్థలం జమ్ము. రోజూవారీ శిక్షణలో భాగంగా గాల్లోకి ఎగిరిన సమయంలో.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అనంతరం నియంత్రణ కోల్పోయి పంట పొలాల్లో కుప్పకూలిపోయింది. పైలట్లు ఎజెక్ట్ కూడా అయ్యే ఛాన్స్ కూడా లేకపోవడంతో.. ఇద్దరు స్పాట్‌లో మరణించారు. ఈ ఘటనపై ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిగ్ విమాన ప్రమాదం గురించి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధురి (Vivek Ram Chaudhari) రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు.

  MiG-21... ఫ్లయింగ్ కాఫిన్ , విడో మేకర్ అనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అంటే ఈ ఫ్లైట్‌లో ప్రయాణిస్తే తిరిగిరారనే అపవాదును మూటగట్టుకుంది. భారత వైమానిక దళం MiG-21 బైసన్‌కు నాలుగు స్క్వాడ్రన్‌ల ఉన్నాయి. ఒక్కో స్క్వాడ్రన్‌లో 16 నుంచి 18 జెట్‌లు ఉంటాయి. MiG-2బైసన్ ఈ సిరీస్‌లో సరికొత్త వేరియంట్. అప్‌గ్రేడ్ చేసినప్పటికీ.. తరచూ ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. గత 60 ఏళ్లలో ఏకంగా 400 మిగ్-21 యుద్ధ విమానాలు కూలిపోయాయి.ఈ ప్రమాదాల్లో 200 మందికి పైగా పైలట్లు ప్రాణాలు కోల్పోయారు.

  1964లో MiG-12 యుద్ధ విమానం మొదటి సూపర్‌సోనిక్ ఫైటర్ జెట్‌గా భారత వైమానిక దళంలోకి చేరింది. ప్రారంభంలో ఈ జెట్‌లను రష్యాలో తయారు చేశారు. వీటిని అసెంబుల్ చేసే హక్కులతో పాటు సాంకేతికను కూడా భారత్ పొందింది. ఆ తర్వాత 1967లో ఈ విమానాల తయారీకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లైసెన్స్ పొందింది. అనంతరం విమానాల ఉత్పత్తిని ప్రారంభించింది. రష్యా 1985లో మిగ్ విమానాల తయారీని నిలిపివేసింది. ఐతే భారత వాయుసేన మాత్రం దానిని అప్‌గ్రేడ్ వేరియంట్‌ను ఉపయోగిస్తోంది. పాకిస్తాన్‌తో 1971, 1999 కార్గిల్ యుద్ధ సమయంలో కూడా MiG-21 విమానాలు కీలక పాత్ర పోషించాయి. MiG-21 బైసన్ యుద్ధ విమానం .. MiG-21‌కి అప్‌గ్రేడ్ వెర్షన్.ః

  సెప్టెంబర్ 2018 నాటికి భారత వైమానిక దళంలో దాదాపు 120 MiG-21 విమానాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎన్నో విమానాలు సాంకేతిక లోపాలతో కూలిపోయాయి. ఎయిర్‌ఫోర్స్‌లోకి కొత్త విమానాల రాక ఆలస్యం కానుండడంతో.. మరో మూడేళ్ల పాటు ఈ పాత విమానాలనే ఉపయోగించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత వాయుసేన నుంచి వీటిని శాశ్వతంగా తప్పించే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Indian Air Force, Rajasthan

  ఉత్తమ కథలు