హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Jammu Kashmir: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఏకంగా పోలీస్ బస్సుపై దాడి -ఎస్సై, కానిస్టేబుల్ మృతి, 12మందికి గాయాలు

Jammu Kashmir: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఏకంగా పోలీస్ బస్సుపై దాడి -ఎస్సై, కానిస్టేబుల్ మృతి, 12మందికి గాయాలు

శ్రీనగర్ లో పోలీస్ బస్సుపై ఉగ్రదాడి, ఆరా తీసిన మోదీ

శ్రీనగర్ లో పోలీస్ బస్సుపై ఉగ్రదాడి, ఆరా తీసిన మోదీ

జమ్మూకాశ్మీర్ లో వరుస ఎన్ కౌంటర్లలో అటు ఉగ్రవాదులు, ఇటు భద్రతాబలగాల సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శ్రీనగర్ పరిధిలోనే ఉగ్రదాడి జరిగింది. శ్రీనగర్ శివారులోని జెవాన్ ప్రాంతంలో ఓ పోలీస్ బస్సుపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఇంకా చదవండి ...

కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత తగ్గాయనుకున్న ఉగ్రకలాపాలు ఇటీవల మళ్లీ పెరుగుతూరావడం కలకలం రేపుతున్నది. వరుస ఎన్ కౌంటర్లలో అటు ఉగ్రవాదులు, ఇటు భద్రతాబలగాల సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శ్రీనగర్ పరిధిలోనే ఉగ్రదాడి జరిగింది. శ్రీనగర్ శివారులోని జెవాన్ ప్రాంతంలో ఓ పోలీస్ బస్సుపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ ఎస్సై, కానిస్టేబుల్ మరణించగా, మరో 12 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆరాతీశారు. జమ్మూకాశ్మీర్ అధికారులు చెప్పిన వివరాలివి..

శ్రీనగర్ సిటీ శివారు జెవాన్ ప్రాంతంలో పోలీస్ శిబిరానికి సమీపంలోని పంతా చౌక్ వద్ద సోమవారం ఉగ్రదాడి జరిగింది. బస్సులో 25 మంది పోలీసులు ఉండటాన్ని గుర్తించిన ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పోలీసుల బస్సును చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. నిమిషాలపాటు ఆగకుండా కాల్పులు జరిపారు. బయటివైపు భద్రతా బలగాలు తేరుకుని, ఎదురుకాల్పులు జరిపేలోగా ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. పారిపోయిన ఉగ్రవాదుల్లొ ఒకడికి బుల్లెట్ గాయాలైనట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.

Hyderabad : శిల్పా చౌదరికి మళ్లీ షాక్ -ఆ పనికి భర్తను వాడుకోలేదా? -కోర్టు అనూహ్య తీర్పుఉగ్రదాడిలో జమ్మూకాశ్మీర్ పోలీస్ విభాగానికి చెందిన ఎస్సై గులాం హుస్సేన్, సెలెక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్ సఫీక్ అలీ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. బుల్లెట్ గాయాలయిన మరో 12 మంది పోలీసులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న సాయుధ బలగాలు వెంటనే ఆ ప్రదేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి.

Harnaaz Sandhu : విశ్వసుందరి Miss Universe 2021గా భారతీయ అందం హర్నాజ్ సంధు.. 21ఏళ్ల తర్వాత


కొన్నిరోజుల కిందట కూడా ఇదే తరహాలో ఓ పోలీస్ బస్సుపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. డిసెంబరు 10న బందిపొరా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మరణించారు. ఇటీవల కశ్మీర్ లోయలో వలస కూలీలపై జరిగిన దాడుల తర్వాత ఉగ్రవాదులు పోలీస్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, సెంట్రల్ కాశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లా రెండ్రోజుల కిందట జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. శ్రీనగర్ ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. మరణించిన భద్రతా సిబ్బంది కుటుంబాలకు సానుభూతి తెలియజేసినట్లు పీఎంఓ ట్వీట్ చేసింది. పోలీసులు, భద్రతా దళాలు తీవ్రవాద శక్తులను సహించబోదని జమ్మూ కశ్మీర్ లెఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.

Published by:Madhu Kota
First published:

Tags: Jammu kashmir, Terrorists

ఉత్తమ కథలు