హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మరో చారిత్రాత్మక రోజు.. 30 ఏళ్ల తర్వాత మల్టీ ప్లెక్స్ సినిమా హాళ్లను ప్రారంభించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా..

మరో చారిత్రాత్మక రోజు.. 30 ఏళ్ల తర్వాత మల్టీ ప్లెక్స్ సినిమా హాళ్లను ప్రారంభించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా..

మల్టీప్లెక్స్ ప్రారంభించిన గవర్నర్ మనోజ్ సిన్హా

మల్టీప్లెక్స్ ప్రారంభించిన గవర్నర్ మనోజ్ సిన్హా

Jammu kashmir:  జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం పుల్వామా, షోపియాన్ ప్రాంతాలలో మల్టీ ప్లెక్స్ సినిమా హళ్లను ప్రారంభించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Jammu and Kashmir, India

కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ లో మరోక అద్భుత ఘట్టం ఆవిష్కరించబడింది. పుల్వామా, షోపియన్ ప్రాంతాలలో స్థానిక గవర్నర్ మనోజ్ సిన్హా మల్టీ ప్లెక్స్ సినిమా హళ్లను ప్రారంభించారు. దీనికి స్థానిక ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున హజరయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌కు ఈరోజు చారిత్రాత్మకమైన రోజు. పుల్వామా,  షోపియాన్‌లోని మల్టీపర్పస్ సినిమా హాళ్లు సినిమా స్క్రీనింగ్, ఎంటర్ టైన్ మెంట్ వంటి అనేక సౌకర్యాలను అందిస్తాయి.  అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయని సిన్హా అన్నారు.

జిల్లా యంత్రాంగం సహకారంతో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ యూత్ చొరవలో భాగంగా జిల్లా కేంద్రంలో సినిమా హాళ్ల ఏర్పాటును చేపట్టారు. లెఫ్టినెంట్ గవర్నర్ పుల్వామా, షోపియాన్‌లోని మల్టీపర్పస్ సినిమా హాళ్లను పౌరులకు, ముఖ్యంగా కాశ్మీర్ యువ తరానికి అంకితం చేశారు. మిషన్ యూత్ కింద కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో ఇలాంటి మల్టీపర్పస్ సినిమా హాళ్లను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ విజన్‌ను సిన్హా పంచుకున్నారు. అనంత్‌నాగ్, శ్రీనగర్, బందిపోరా, గందర్‌బల్, దోడా, రాజౌరి, పూంచ్, కిష్త్వార్,  రియాసీలలో సినిమా హాళ్లు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో మనోజ్ సిన్హా మాట్లాడుతూ.. "సినిమా అనేది ప్రజల సంస్కృతి, విలువలు, ఆకాంక్షలను ప్రతిబింబించే శక్తివంతమైన సృజనాత్మక మాధ్యమమని అన్నారు. ఇది విజ్ఞాన ప్రపంచానికి తలుపులు తెరుస్తుంది, కొత్త ఆవిష్కరణలు, ప్రజలు ఒకరి సంస్కృతిని బాగా అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని సిన్హా పేర్కొన్నారు. 1990ల చివరలో అధికారులు కొన్ని థియేటర్లను తిరిగి తెరవడానికి ప్రయత్నించినప్పటికీ, సెప్టెంబర్ 1999లో లాల్ చౌక్ నడిబొడ్డున ఉన్న రీగల్ సినిమాపై ఘోరమైన గ్రెనేడ్ దాడి చేయడం ద్వారా తీవ్రవాదులు అలాంటి ప్రయత్నాలను అడ్డుకున్నారు.

లోయలో 1980ల చివరి వరకు దాదాపు డజను స్వతంత్ర సినిమా హాళ్లు పనిచేశాయి. అయితే యజమానులను ఉగ్రవాదులు బెదిరించడంతో వారు వ్యాపారాలను ముగించాల్సి వచ్చింది. జమ్మూ కాశ్మీర్‌కు సినిమా ప్రపంచంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. కొత్త చలనచిత్ర విధానం మరియు సౌకర్యాలు సృష్టించడం వలన J&Kని మరోసారి ఇష్టమైన షూటింగ్ గమ్యస్థానంగా మార్చారు.  కేంద్ర పాలిత ప్రాంతానికి చలనచిత్ర నిర్మాణం యొక్క స్వర్ణయుగాన్ని తిరిగి తీసుకువచ్చారని లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు.

ఈ ప్రాంతంలోని యువతకు సాధికారత కల్పించాలనే ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించిన సిన్హా, "జమ్మూ కాశ్మీర్‌లోని ప్రతిభావంతులైన యువతకు వారి విద్య మరియు నైపుణ్యాభివృద్ధికి సరైన వేదిక, ఆధునిక సౌకర్యాలు ఉండేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. కొత్త సినిమా హాళ్లు స్థానికులకు ఉపాధిని కల్పిస్తాయని, యువతకు శిక్షణ, సెమినార్‌లకు ఉత్సాహభరితమైన స్థలాన్ని కూడా అందిస్తుందని సిన్హా అన్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Jammu and Kashmir, Multiplex

ఉత్తమ కథలు