Mumbai Blasts Accused Abu Bakar Arrested : భారత భద్రతా సంస్థలు గొప్ప విజయాన్ని సాధించాయి. 29 ఏళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అబూ బకర్ ఎట్టకేలకు భారత్ భద్రతా దళాలకు చిక్కిపోయాడు. ఇన్నాళ్లు పాకిస్తాన్, అరబ్ దేశాల్లో తలదాచుకున్న అబూ బకర్ ను యూఏఈ ఏజెన్సీల సహకారంతో భారత భద్రతా సంస్థలు పట్టుకున్నాయి. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం శిష్యుడు, 1993 ముంబై వరుస బాంబు పేలుళ్లలో ప్రధాన నిందితుడు అయిన అబూ బకర్ ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో శుక్రవారం అధికారులు అరెస్ట్ చేశారు. అబూ బకర్‌ను త్వరలోనే భారత్‌కు రప్పిస్తానని ఉన్నత వర్గాలు ధృవీకరించాయి.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చినవారిలో అబు బకర్ ఉన్నాడు. అంతేకాకుండా ముంబై వరుస పేలుళ్ల సమయంలో ఉపయోగించిన ఆర్‌డిఎక్స్‌ను భారతదేశానికి తీసుకువచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముంబై వరుస బాంబు పేలుళ్ల తరువాత అబూ బకర్ భారతదేశం వదిలేసి దర్జాగా విదేశాలకు పారిపోయాడు. ఇంతకాలం పాకిస్తాన్, అరబ్ దేశాల్లో తలదాచుకున్న అబూ బకర్ కోసం భారత భద్రతా సంస్థలు గాలిస్తూనే ఉన్నాయి. 2019లో అబూ బకర్ భారత భద్రతా దళాలకు చిక్కినా డాక్యుమెంటేషన్ సమస్యల కారణంగా అతను అప్పట్లో తప్పించుకున్నాడు. కొన్ని డాక్యుమెంట్స్ లేకపోవడంతో అతను యూఏఈ అధికారుల కస్టడీ నుండి తనకి తాను విడుదల కాలిగాడు. అయితే ఇంతకాలం భారత భద్రతా సంస్థలకు చిక్కకుండా విదేశాల్లో తలదాచుకుని ఎంజాయ్ చేస్తున్న అబూ బకర్ ఇప్పుడు చిక్కడంతో ముంబై బాంబు పేలుళ్ల బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 1993 లో ముంబైలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఈ వరుస పేలుళ్లలో 257 మంది మృతి చెందగా, 713 మంది గాయపడ్డారు
ALSO READ Plane Crash : కుప్పకూలిన పర్యాటక విమానం..టూరిస్టులు మృతి
అబూ బకర్ పూర్తి పేరు అబూ బకర్ అబ్దుల్ గఫూర్ షేక్. దావూద్ ఇబ్రహీంకు కీలకమైన లెఫ్టినెంట్లుగా ఉన్న మహ్మద్, ముస్తఫా దోస్సాలతో కలిసి అబూ బకర్ స్మగ్లింగ్ లో పాల్గొన్నాడు. వీరిద్దరూ దావూద్ ఇబ్రహీంకు ప్రత్యేకం. గల్ఫ్ దేశాల నుంచి ముంబై దాని పరిసర ప్రాంతాలకు బంగారం, బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులను స్మగ్లింగ్ చేసేవాడు. 1997లో అబూ బకర్ పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయబడింది. అబూ బకర్ ఇరాన్ జాతీయురాలిని రెండో భార్యగా వివాహం చేసుకున్నాడు. అబూ బకర్‌కు దుబాయ్ లో ఎన్నో వ్యాపార ఆస్తులు ఉన్నాయి.
ALSO READ Hen Arrest : అనుమానంతో కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు
అయితే ఇంతకాలం భారతదేశానికి చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంతో పాటు అతని ప్రధాన అనుచరుడు టైగర్ మెమన్ మాత్రం ఇంకా చిక్కడం లేదు. 1993 ముంబాయి బాంబు పేలుళ్ల కేసు ప్రధాన నిందితుడు, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో తలదాచుకున్నాడని భారతదేశం వాదిస్తున్నా అందుకు పాకిస్తాన్ కుంటిసాకులు చెబుతూ తమ దేశంలో దావుద్ ఇబ్రహీం లేడని వాదిస్తోంది. దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు టైగర్ మెమన్ మాత్రం భారతదేశ భద్రతా దళాలకు చిక్కకుండా ఇప్పటి వరకు తప్పించుకుని తిరుగుతున్నాడు. టైగర్ మెమన్ ఎక్కడ ఉన్నాడు అనే విషయం పక్కాగా తెలీయడం లేదు. దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుల్లో ఒక్కడైన టైగర్ యాకూబ్ మాత్రం భారత్ కు చిక్కిపోయాడు. 1993 ముంబాయి వరుస బాంబు పేలుళ్లు జరపడానికి ఆర్థిక సహాయం చేశారని, వాహనాలు కొనగోలు చెయ్యడానికి సహకరించాడని వెలుగు చూడటంతో టైగర్ యాకుబ్ కు 2013 మార్చి 21వ తేదీన సుప్రీంకోర్టు మరణ శిక్ష విదించింది. 2015 జులై 30వ తేదీన మహారాష్ట్ర ప్రభుత్వం నాగపూర్ సెంట్రల్ జైల్లో టైగర్ యాకుబ్ కు ఉరి శిక్ష విధించింది. ఇదే కేసులో 10 మంది నిందితులకు మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arrested, Mumbai attacks, Terrorists, UAE