Home /News /national /

197 SIGNATORIES CALL OUT BIAS IN LETTER TO PM MODI AFTER CCG LETTER ON HATE POLITICS PVN

Letter On hate Politics: ద్వేషపూరిత రాజకీయాలపై ప్రధానికి CCG లేఖ..మోదీకి మద్దతుగా కన్సర్న్‌డ్ సిటిజన్స్ లేఖ

ప్రధాని నరేంద్ర మోదీ(ఫైల్ ఫొటో)

ప్రధాని నరేంద్ర మోదీ(ఫైల్ ఫొటో)

Concerned Citizens :   దేశంలో బీజేపీ పాలనలో వున్న రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి చెప్పేవిధంగా ప్రధాని మోదీ పిలుపు నివ్వాలంటూ కాన్‌స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూప్(CCG)పేరుతో 108 మంది మాజీ సివిల్ సర్వెంట్లు ఇటీవల ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...
CCG's Letter On hate Politics:  దేశంలో బీజేపీ పాలనలో వున్న రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి చెప్పేవిధంగా ప్రధాని మోదీ పిలుపు నివ్వాలంటూ కాన్‌స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూప్(CCG)పేరుతో 108 మంది మాజీ సివిల్ సర్వెంట్లు ఇటీవల ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్, మాజీ హోం కార్యదర్శి జికె పిళ్లై, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టికెఎ నాయర్ సహా 108 మంది లేఖపై సంతకాలు చేశారు. దేశంలో ద్వేషంతో నిండిన విధ్వంసం యొక్క ఉన్మాదాన్ని మనం చూస్తున్నాము, ఈ బలిపీఠంపై ఉన్నది కేవలం ముస్లింలు, ఇతర మైనారిటీలు మాత్రమే కాదు,స్వయంగా భారత దేశ రాజ్యాంగమని వారు తమ లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగ భవనాన్ని ధ్వంసం చేస్తుండటంతో తమ వేదనను బయటకు చెబుతున్నామని వారు తెలిపారు. అసోం, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ వంటి అనేక రాష్ట్రాల్లో గత కొన్ని సంవత్సరాలుగా మైనారిటీ వర్గాలపై, ముఖ్యంగా ముస్లింలపై ద్వేషపూరిత హింస పెరిగిందని తెలిపారు. "సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే మీ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి, మేము మీ మనస్సాక్షికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సంవత్సరం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో, పక్షపాత పరిగణనలకు అతీతంగా, మీ పార్టీ నియంత్రణలో ఉన్న ప్రభుత్వాలు చాలా పట్టుదలతో ఆచరిస్తున్న ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలని మీరు పిలుపునిస్తారని మేము ఆశిస్తున్నాము" అని వారు తమ లేఖలో పేర్కొన్నారు

అయితే 108 మంది మాజీ సివిల్ సర్వెంట్లు చేసిన ఆరోపణలను వ్యతిరేకిస్తూ మాజీ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు, సాయుధ దళాల మాజీ అధికారులు మొత్తం 197 మంది ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి తాజాగా ఓ లేఖ రాశారు. "కన్సర్న్‌డ్ సిటిజన్స్" పేరుతో ఎనిమిది మంది విశ్రాంత న్యాయమూర్తులు, 97 మంది మాజీ బ్యూరోక్రాట్లు, 92 మంది సైనిక దళాల మాజీ అధికారులు ఓ బహిరంగ లేఖను ప్రధాని మోదీకి రాశారు. CCG లేఖ స్పష్టంగా సైద్ధాంతిక భావజాలం, ఆలోచనలు, విశ్వాసాల పక్షపాతంతో కూడినదని కన్సర్న్‌డ్ సిటిజన్స్ గ్రూపు ఆరోపించింది. రాజ్యాధికార అతిక్రమణ గురించి తప్పుడు కథనాలను సృష్టించవద్దని CCG సభ్యులను కోరారు. పాశ్చాత్య మీడియా, పాశ్చాత్య సంస్థలు వాడుతున్న పదజాలాలకు, CCG లేఖలో ఉపయోగించిన మాటలకు సారూప్యత ఉందని గుర్తు చేసింది. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై CCG మౌనంగా ఉందని, దీనినిబట్టి CCG సభ్యుల అనైతిక, స్వార్థపూరిత వైఖరి తేటతెల్లమవుతోందన్నారు. వేర్వేరు రాజకీయ పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో జరుగుతున్న అనేక హింసాత్మక సంఘటనలపై వీరు స్పందించే తీరును ఈ వైఖరే రూపకల్పన చేస్తోందని పేర్కొన్నారు. ఎంపిక చేసుకుని పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై కూడా వీరి స్పందనను ఈ వైఖరే నిర్ణయిస్తోందన్నారు.

ALSO READ Fake Baba : బాబా బాగోతం బట్టబయలు..19 ఏళ్లుగా మహిళపై,ఇప్పుడు ఆమె కూతుళ్లపై..వీడి ఖాతాలో ఇంకెందరో!

వారి ఆగ్రహం, ఆవేదన ఉత్తుత్తి నైతిక ప్రమాణాల ప్రదర్శన మాత్రమే కాకుండా, వారు వాస్తవానికి తాము పోరాడాలని కోరుకుంటున్న విద్వేష రాజకీయాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఇటీవల ఐదు రాష్ట్రాల శాసన సభలకు జరిగిన ఎన్నికల ఫలితాలను కన్సర్న్‌డ్ సిటిజన్స్ గ్రూపు తమ లేఖలో ప్రస్తావించింది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో కాన్‌స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూపు (CCG)సభ్యులు తమ అక్కసును వెళ్ళగక్కుతున్నారని ఆరోపించారు. ప్రజాభిప్రాయం మోదీకి గట్టి మద్దతుగా నిలవడంతో, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా తమ నైరాశ్యాన్ని వీరు బయటపెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా,కన్సర్న్‌డ్ సిటిజన్స్ పేరుతో రాసిన ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో.. సిక్కిం హైకోర్టు మాజీ జడ్జి ప్రమోద్ కోహ్లీ,కేరళ మాజీ చీఫ్ సెక్రటరీ ఆనంద్ బోస్,ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీలు ఉమేష్ కుమార్ మరియు కే.అరవిందరావ్,తెలంగాణ మాజీ డీజీపీ అలోక్ శ్రీవాత్సవ్,కర్ణాటక మాజీ సెక్రటరీ ఏకే మోనప్ప కూడా ఉన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు