HOME »NEWS »NATIONAL »191181 people are vaccinated on day 1 reports health ministry hsn

Covid 19 Vaccine: దేశ వ్యాప్తంగా మొదటి రోజు ఎంత మంది కరోనా టీకాను తీసుకున్నారంటే..

Covid 19 Vaccine: దేశ వ్యాప్తంగా మొదటి రోజు ఎంత మంది కరోనా టీకాను తీసుకున్నారంటే..
కరోనా టీకా (ఫైల్ ఫొటో)

కరోనాపై విజయం సాధించామన్న ధీమా ప్రతి ఒక్క దేశ పౌరుడిలోనూ కనిపిస్తోంది. సోషల్ మీడియాలో శనివారం అంతా కొవిడ్ వ్యాక్సినేషన్ అంశమే ట్రెండింగ్ గా నిలిచింది. దీంతో మొదటి రోజు కరోనా వ్యాక్సిన్ ను ఎంత మంది వేసుకున్నారన్న దానిపై కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

  • Share this:
    దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శనివారం ప్రారంభమయింది. ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం అన్ని రాష్ట్రాల్లోనూ కొవిడ్ వ్యాక్సినేషన్ ను ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందించారు. విపత్తు కాలంలో వారు అందించిన సేవలు వెలకట్టలేనివనీ, అందుకే మొదటగా వారికే కొవిడ్ వ్యాక్సినేషన్ ను ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో హెల్త్ వర్కర్లు, పారిశుధ్య కార్మికులు వంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ టీకాను తీసుకోవడం మొదలు పెట్టారు. కరోనాను అంతం చేశామంటూ టీకా తీసుకున్న అనంతరం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కరోనాపై విజయం సాధించామన్న ధీమా ప్రతి ఒక్క దేశ పౌరుడిలోనూ కనిపిస్తోంది. సోషల్ మీడియాలో శనివారం అంతా కొవిడ్ వ్యాక్సినేషన్ అంశమే ట్రెండింగ్ గా నిలిచింది. దీంతో మొదటి రోజు కరోనా వ్యాక్సిన్ ను ఎంత మంది వేసుకున్నారన్న దానిపై కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

    మొదటి దశలో మొదటి రోజు దేశ వ్యాప్తంగా లక్షా 91వేల మంది కరోనా టీకాను తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. లక్షా 91 వేల 181 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కొవిడ్ టీకాను తీసుకున్నట్టు తెలిపింది. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఒక్కరికి కూడా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని స్పష్టం చేసింది. టీకాను తీసుకుని ఆస్పత్రి పాలయిన వారు లేరని వెల్లడించింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా మొదటి రోజు ముగిసిందని తెలిపింది. త్వరలోనే మరింత మందికి కరోనా టీకాను అందిస్తామని వివరించింది.



    కాగా మహారాష్ట్రలో కోవిన్ యాప్ లో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు అడ్డంకి ఏర్పడింది. మహారాష్ట్ర వ్యాప్తంగా జనవరి 18 వరకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సాంకేతిక సమస్యలను అధిగమించిన తర్వాత కొవిడ్ వ్యాక్సిన్ ను అందించే ప్రక్రియను పున:ప్రారంభిస్తామని వెల్లడించింది. ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ తొలిదశ మొదటి రోజు ప్రశాంతంగా ముగియడం పట్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:January 16, 2021, 23:29 IST

    टॉप स्टोरीज