ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ... తెలంగాణ నుంచి 19 మంది విద్యార్థులు

Pariksha Pe Charcha : పరీక్షా పే చర్చ కార్యక్రమంలో తెలంగాణ నుంచీ 19 మంది విద్యార్థుల్ని ఎంపిక చేశారు. సోమవారం ఈ కార్యక్రమం జరగనుంది.

news18-telugu
Updated: January 19, 2020, 5:29 AM IST
ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ... తెలంగాణ నుంచి 19 మంది విద్యార్థులు
ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ... తెలంగాణ నుంచి 19 మంది విద్యార్థులు
  • Share this:
Pariksha Pe Charcha Programme : జనవరి 20న ఢిల్లీలోని... తల్కటోరా స్టేడియంలో జరగనున్న ప్రధాని నరేంద్రమోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో తెలంగాణ నుంచి మొత్తం 19 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో 13 మంది అమ్మాయిలే ఉన్నారు. ఓవరాల్‌గా ఈ కార్యక్రమంలో 2000 మంది విద్యార్థులు, టీచర్లూ పాల్గొనబోతున్నారు. వీళ్లలో కొందరు ప్రధాని మోదీని పరీక్షలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఇందుకోసం గ్రాటిడ్యూట్ ఈజ్ గ్రేట్, మీ భవిష్యత్తు మీ ఆశయాల్లో, పరీక్షల పరిశీలన, మా విధులు-మీ నిర్వహణ, బ్యాలెన్స్ ఈజ్ బెనిఫీషియల్ వంటి థీమ్స్ ఎంపిక చేశారు. ఈ థీమ్స్ ఆధారంగా వేసే ప్రశ్నలకు మోదీ తనదైన శైలిలో సమాధానాలు చెబుతారు. ప్రతీ సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈసారి జరగబోయేది మూడో కార్యక్రమం. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల్లో ఉండే భయాలూ, టెన్షన్లను పోగొట్టే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. ప్రతీ సంవత్సరం దీన్ని దూరదర్శన్, ఆకాశవాణిలో లైవ్ ప్రసారం చేస్తోంది. అలాగే... చాలా స్కూళ్లలో దీన్ని లైవ్‌లో చూసేందుకు వీలు కల్పిస్తున్నారు.

9 నుంచీ 12 తరగతులకు చెందిన 2000 మంది విద్యార్థుల్లో 1050 మందిని ఎస్సే కాంపిటీషన్ నిర్వహించి సెలెక్ట్ చేశారు. మిగతావారిని వేర్వేరు విధానాల్లో సెలెక్ట్ చేశారు. దేశవ్యాప్తంగా దివ్యాంగ స్కూళ్ల నుంచీ... 50 మంది దివ్యాంగ విద్యార్థుల్ని కూడా ఎంపిక చేశారు. వాళ్లంతా ప్రధాని మోదీతో డైరెక్టుగా ఇంటరాక్ట్ అవుతారు. దివ్యాంగ విద్యార్థుల్ని ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఎగ్జామ్స్‌లో ఒత్తిడిని జయించడం ఎలా అనే అంశం ఇచ్చి... దాని ఆధారంగా పెయింటింగ్ వెయ్యమన్నారు. చక్కగా పెయింటింగ్స్‌ వేసిన విద్యార్థుల్ని ఎంపిక చేశారు. మరో స్పెషల్ ఏంటంటే... చక్కటి పెయింటింగ్స్‌ని ఈ కార్యక్రమంలో ప్రదర్శనకు పెట్టబోతున్నారు.

గతేడాది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 1.4 లక్షల ఎంట్రీలు రాగా... ఈసారి 2.6 లక్షల ఎంట్రీస్ వచ్చాయి. 2018లో మోదీ... 10 ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 2019లో 16 ప్రశ్నలకు జవాబు ఇచ్చారు. ఈ సంవత్సరం ఎన్ని ప్రశ్నలు ఎదురవుతాయన్నది ఆసక్తికరం.

First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు