ఆ అమ్మాయికి 18 రోజుల క్రితమే పెళ్లయింది. ఇళ్లంతా సందడిగా ఉంది. కొత్తగా అత్తింట్లో అడుగుపెట్టింది. అయితే పెళ్లి తర్వాత పూజలు చేసేందుకు పుట్టింటి నుంచి పిలుపువచ్చింది. భర్తతో పాటు ఆమె పుట్టింటికి వెళ్లింది. అయితే పూజా కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక ఆమె అత్తింటికి వెళ్లాల్సింది. అయితే తన గ్రామానికి చెందిన ప్రేమికుడితో పారిపోయిది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ అమ్మాయి లక్షల విలువైన బంగారు ఆభరణాలు, డబ్బు తీసుకెళ్లింది.
మధ్యప్రదేశ్ చత్తర్‌పూర్ జిల్లాలోని చిర్వారి గ్రామంలో జరిగింది ఈ ఘటన. ఆ విలేజ్‌కు చెందిన 20 ఏళ్ల అమ్మాయి పెళ్లయిన 18 రోజులకే తన లవర్ బజ్జూ యాదవ్‌తో పారిపోయింది. ఈ ఘటన డిసెంబర్ 24న జరుగగా.. అలీపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. పెళ్లి కూతురు కుటుంబం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఇక ఈ విషయంపై స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు. జంప్ అయిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఇక కొత్తగా పెళ్లయి భార్య పారిపోవడంతో ఆ భర్త అత్తింటికి వచ్చి గొడవ చేశాడట.
ఈ విషయంపై పెళ్లి కూతురు తండ్రి మాట్లాడుతూ అమ్మాయి తీసుకెళ్లిన డబ్బు, బంగారం కావాలని వెంటనే కావాలని అబ్బాయి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు. దాదాపు రూ.5లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.20వేల నగదు తన కూతురు తీసుకెళ్లిందని చెప్పారు.