Kashmiri Pandit teachers : కొద్ది రోజులుగా కశ్మీర్(Kashmir)లో ఉగ్రవాదులు సామాన్య పౌరులను ముఖ్యంగా కశ్మీర్ పండిట్లను(Kashmiri Pandit)టార్గెట్ చేసుకుని హత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కశ్మీర్ పండిట్లు భయాందోళన చెందుతున్నారు. తమను వేరే ప్రాంతాలకు తరలించాలని, లేదంటే ఉద్యోగాలకు రాజీనామా చేస్తామని, లీవులు పెడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దాదాపు ఆరు వేల మంది ఉద్యోగులు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగారు. మే 12న సెంట్రల్ కశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లా చదూరా ప్రాంతంలో ఉగ్రవాదుల కాల్పుల్లో రాహుల్ భట్ మరణించాడు. ఈ సంఘటన నాటి నుంచి కశ్మీరీ పండిట్ల నిరసనలు తీవ్రమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కశ్మీరీ పండిట్ల భద్రతకు సంబంధించిన డిమాండ్లపై ప్రధానంగా చర్చించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 177 మంది కశ్మీరీ పండిట్ ఉపాధ్యాయులను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేసింది. 2012లో ప్రధాన మంత్రి ప్రత్యేక ప్యాకేజీ కింద ఉద్యోగంలో చేరిన 177 మంది కశ్మీరీ పండిట్ టీచర్లను సురక్షిత ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేశారు. కాగా, కొద్ది రోజుల నుంచి కశ్మీర్‌లో వరస హత్యలు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు నిరాయుధులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీస్తున్నారు. మే 1 నుంచి పౌరులు, వలస వ్యక్తుల లక్ష్యంగా కశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 9కి పెరిగింది. గురువారం జమ్ముకశ్మీర్‌లో వేర్వేరు చోట్ల ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక బ్యాంక్ మేనేజర్, ఇద్దరు వలస కూలీలు మరణించారు. దీనికి ముందు జమ్మూ ప్రాంతంలోని సాంబా జిల్లాకు చెందిన ఓ మహిళా టీచర్‌ను మంగళవారం దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని ఓ పాఠశాలలో ఉగ్రవాదులు కాల్చి చంపారు.
ALSO READ Son met mother after 27 years: 14 ఏళ్ల వయస్సులో తప్పిపోయి..27 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకొడుకులు!
మే 18న ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా వద్ద ఉన్న వైన్‌షాప్‌లోకి ఉగ్రవాదులు చొరబడి గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనలో జమ్మూ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మే 24న శ్రీనగర్‌లో నివాసం వెలుపల పోలీస్ అయిన సైఫుల్లా ఖాద్రీని, అనంతరం రెండు రోజులకు టీవీ నటి అమ్రీన్ భట్‌ను బుద్గామ్‌లో ఉగ్రవాదులు కాల్చి చంపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jammu and Kashmir, Terrorists