ఢిల్లీ:- హోటల్‌లో అగ్నిప్రమాదం... 17మంది సజీవ దహనం

కరోల్‌బాగ్‌లోని ఓ హోటల్‌లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 9 మంది సజీవదహన మయ్యారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 1:45 PM IST
ఢిల్లీ:- హోటల్‌లో అగ్నిప్రమాదం... 17మంది సజీవ దహనం
ఢిల్లీ కరోల్‌బాగ్ హోటల్‌లో అగ్నిప్రమాదం
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 1:45 PM IST
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కరోల్‌బాగ్‌లోని అర్పిత్ ప్యాలెస్ హోటల్‌లో మంగళవారం తెల్లవారుజామున 4.30గంటలకు మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో హోటల్‌లో మొత్తం 60మంది ఉండగా.. 17మంది సజీవ దహనమైనట్టు అధికారులు తెలిపారు. మరో తొమ్మిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

మొదట నాలుగో అంతస్తులో వ్యాపించిన మంటలు ఆ తర్వాత మిగతా ఫ్లోర్స్‌కు వ్యాపించినట్టు అధికారులు తెలిపారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ప్రమాదం స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సుమారు 26 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు.First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...