హిమాచల్ ప్రదేశ్ లోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రం కులు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి మలానా గ్రామంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఊరిలో కొంత భాగం తగలబడింది. మొత్తం 16 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయని, 150 మందికిపైగా నిరాశ్రయులయ్యారని అధికారులు చెప్పారు. ఆస్తినష్టం భారీగా ఉన్నా, అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదు.
కులు జిల్లాలోని మలానాలో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే ఐటీబీపీ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ డైరెక్టర్ సుదేశ్ కుమార్ తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదని ఆయన చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా, ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ విచారం వ్యక్తం చేశారు. చారిత్రక మలానా గ్రామంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన విచారకరమని, బాధిత కుటంబాలకు తన సానుభూతిని తెలియజేస్తున్నానని ప్రధాని ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం అవసరమైన అన్ని సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపడతాయని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Himachal Pradesh, Pm modi