భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ఢిల్లీలో విమానాలు రద్దు

ఢిల్లీతో ప్రధాన నగరంతో పాటు NCR పరిధిలోని నోయిడా, గురుగ్రామ్‌లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

news18-telugu
Updated: December 19, 2019, 3:55 PM IST
భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ఢిల్లీలో విమానాలు రద్దు
NH-8పై భారీగా ట్రాఫిక్ జామ్
  • Share this:
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు మిన్నంటాయి. ఆందోళనకారులు రోడ్లపైకి చేరుకొని ఎక్కడికక్కడ బైఠాయించారు. పౌరసత్వ చట్ట సవరణ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీల విద్యార్థులు, ప్రజా సంఘాలు, పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు రోడ్లపై ఆందోళనలు చేయడంతో ఢిల్లీలోని NH-8పై ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఢిల్లీతో ప్రధాన నగరంతో పాటు NCR పరిధిలోని నోయిడా, గురుగ్రామ్‌లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లే పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 16 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. మరి కొన్ని సర్వీసులు రద్దయ్యాయి. ఇండిగో విమాన సంస్థ 19 విమానాలను రద్దు చేసింది. తమ సిబ్బందిలో చాలా మంది ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారని.. ఆ కారణంగానే విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. టికెట్లు రద్దుచేసుకునే వారికి ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని తెలిపింది.

First published: December 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు