హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పాక్ సరిహద్దుల్లో 150 మీటర్ల రహస్య సొరంగం.. ఆ ఉగ్రవాదులు దాని గుండానే భారత్‌లోని ప్రవేశించారా?

పాక్ సరిహద్దుల్లో 150 మీటర్ల రహస్య సొరంగం.. ఆ ఉగ్రవాదులు దాని గుండానే భారత్‌లోని ప్రవేశించారా?

ప్రతీకాత్మక చిత్రం(PTI)

ప్రతీకాత్మక చిత్రం(PTI)

జమ్మూ కశ్మీర్‌ సాంబా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 150 మీటర్ల పొడవు ఉన్న రహస్య సొరంగ మార్గాన్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆదివారం కనుగొంది.

  జమ్మూ కశ్మీర్‌ సాంబా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 150 మీటర్ల పొడవు ఉన్న రహస్య సొరంగ మార్గాన్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆదివారం కనుగొంది. ఈ విషయాన్ని డీజీపీ దిల్‌బాగ్ సింగ్ ధ్రువీకరించారు. సరిహద్దు వెంబడి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నసిబ్బంది ఈ సొరంగ మార్గాన్ని గుర్తించినట్టు బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబడేందుకు ఈ సొరంగాన్ని ఉపయోగించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. బీఎస్‌ఎఫ్ ఐజీ(జమ్మూ సరిహద్దు) ఎన్ ఎస్ జమ్వాల్, జమ్మూ రేంజ్ పోలీస్ ఐజీ ముఖేష్ సింగ్‌లతో కలిసి డీజీపీ దిల్‌బాగ్ సింగ్.. ఆ సొరంగాన్ని పరిశీలించారు.

  ఇటీవల జమ్మూ హైవేపై నగ్రోటా ప్రాంతంలోని బాన్‌ టోల్‌ప్లాజా వద్ద నలుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఓ ట్రక్కులో దాగి ఉన్నవీరిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 28 నుంచి జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలకు అంతరాయం కలిగించేలా దాడులకు పాల్పడేందుకు వారు భారత్‌లోకి ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. వారంతా ముంబై దాడులు జరిగిన నవంబర్ 26వ తేదీన మరోసారి భారీ స్థాయిలో అలాంటి దాడి చేయడానికి కుట్ర పన్నినట్టు నిఘావర్గాలకు తెలిసింది.

  ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో భారత భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. సాంబా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు గుండానే ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడినట్టు భద్రత బలగాలకు సమాచారం అందించింది. అయితే పెద్ద మొత్తంలో ఆయుధాలతో ఉగ్రవాదులు భారత్‌లోకి చోరబడేందుకు ఏదైనా సొరంగ మార్గాన్ని వినియోగించి ఉంటారనే అనుమానంతో భద్రత బలగాలు అన్వేషణ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌లో ఆర్మీ, పోలీసులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సాంబా సెక్టార్‌లో ఈ సొరంగ మార్గాన్ని గుర్తించారు.

  మరోవైపు సరిహద్దుల్లో పాక్ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్ పలుమార్లు కాల్పలు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తునే ఉన్నారు. ఆదివారం రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో సైనిక శిబిరాలను, గ్రామాలను లక్ష్యంగా చేసుకుని చిన్నపాటి ఆయుధాలతో, మోర్టార్లతో దాడికి పాల్పడింది. వారి దాడులకు భారత బలగాలు గట్టిగా బదులిచ్చాయి.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Jammu and Kashmir, Pakistan

  ఉత్తమ కథలు