భారత ఆర్మీ పరాక్రమం.. 15 మంది పాక్ సైనికులు, 8 మంది ఉగ్రవాదుల హతం..

కాల్పుల విరమణ ఒప్పందాన్ని మాటిమాటికి ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్‌కు భారత ఆర్మీ దీటుగా సమాధానం ఇచ్చింది. ఈ నెల 10వ తేదీన జరిగిన కాల్పుల్లో 15 మంది పాక్ సైనికులను, 8 మంది ఉగ్రవాదులను అంతం చేసింది.

news18-telugu
Updated: April 13, 2020, 9:17 AM IST
భారత ఆర్మీ పరాక్రమం.. 15 మంది పాక్ సైనికులు, 8 మంది ఉగ్రవాదుల హతం..
Army Jobs: కరీంనగర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ... దరఖాస్తుకు 10 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం, image: Reuters)
  • Share this:
కాల్పుల విరమణ ఒప్పందాన్ని మాటిమాటికి ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్‌కు భారత ఆర్మీ దీటుగా సమాధానం ఇచ్చింది. ఈ నెల 10వ తేదీన జరిగిన కాల్పుల్లో 15 మంది పాక్ సైనికులను, 8 మంది ఉగ్రవాదులను అంతం చేసింది. భారత సైన్యం ఆర్టిలరీ గన్స్‌తో దాడికి దిగిందని, ఈ దాడిలో పాక్‌ భారీ నష్టాన్ని చవి చూసిందని ఆర్మీ తెలపగా.. దానికి సంబంధించి టెర్రర్‌ లాంచింగ్‌ ప్యాడ్స్‌తో పాటుగా పాక్ ఆర్మీ లాంచింగ్‌ ప్యాడ్స్‌ కూడా ధ్వంసమైనట్లు వీడియో రిలీజ్‌ చేసింది. ఆ నష్టం భారీ స్థాయిలో ఉందని తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. కిషన్ గంగా నది ఒడ్డున పాక్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ దూద్‌నైల్‌పై దాడులు చేయాలనుకుందని తెలిపాయి. సమాచారాన్ని అందుకున్న భారత సైన్యం అక్కడికి ముందుగానే చేరుకుందని, దాడులకు ప్రయత్నించిన పాక్ సైన్యంపై, ఉగ్రవాదులపై భారత ఆర్మీ విరుచుకుపడిందని వివరించాయి.

Published by: Shravan Kumar Bommakanti
First published: April 13, 2020, 9:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading