HOME »NEWS »NATIONAL »15 mlas from congress and jds resigned to their posts and support bjp in karnataka sources nk

కర్ణాటక నెక్ట్స్ సీఎం యడ్యూరప్ప... రాసిపెట్టుకోమంటున్న బీజేపీ...

కర్ణాటక నెక్ట్స్ సీఎం యడ్యూరప్ప... రాసిపెట్టుకోమంటున్న బీజేపీ...
బీఎస్ యడ్యూరప్ప, కర్ణాటక (3 రోజులు. 2018 మే 17-19 వరకు)

Karnataka Politics : అయిపోయింది... అంతా అయిపోయింది... అని కర్ణాటక ప్రస్తుత సీఎం కుమారస్వామి అనుకునేలా బీజేపీ చేస్తోందా? తెరవెనక జరుగుతున్న తంతుకు... జరగబోయే ఫలితం ప్రభుత్వం కూలిపోవడమేనా?

  • Share this:
    కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఔట్... బీజేపీ ఇన్ అని అనుకునే రోజు త్వరలోనే రాబోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సరిగ్గా సీఎం కుమారస్వామి అమెరికా పర్యటనకు వెళ్లిన టైమ్ చూసి బీజేపీ తన వ్యూహాన్ని అమలు చేసిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ రాజకీయ చదరంగంలో తెరవెనక పావులు కదుపుతున్న బీజేపీకి అన్ని రకాలుగా కలిసొచ్చే అవకాశాలు వంద శాతం కనిపిస్తున్నాయి. ప్రజెంట్ పొజిషన్ చూస్తే... 11 మంది కాంగ్రెస్, 4 జేడీఎస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసేశారు. వారిలో ఇద్దరు మంత్రులు సహా... 8 మంది... తమ రాజీనామా లేఖల్ని స్పీకర్‌కి ఇవ్వడానికి వెళ్లారు. ఐతే... స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో... తమ రాజీనామా లేఖలను స్పీకర్ ఆఫీస్‌లో ఇచ్చారు. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి మేజిక్ మార్క్ కంటే... 4 సీట్లు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు 15 మంది రాజీనామా చేస్తే... ఇంకేముంటుంది... నెక్ట్స్ సీన్ ప్రభుత్వం కూలిపోవడమే. ఇందులో మనకు ఎలాంటి డౌటూ అక్కర్లేదు. సో, ప్రభుత్వం కూలిపోతే, ఉప ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలు గెలుచుకుంటే... కమలం పార్టీ అధికారంలోకి వచ్చినట్లే.

    కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. మేజిక్ మార్కు 113. ప్రస్తుతం కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి బలం 117గా ఉంది. కాంగ్రెస్‌కి 77 ఎమ్మెల్యేలు ఉండగా... జేడీఎస్ 37 స్థానాలు గెలుచుకుంది. బీఎస్పీ 1 స్థానం, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు వీరి లోంచీ 15 మంది రాజీనామా చేశారు. వాటిని స్పీకర్ ఇంకా ఆమోదించకపోయినా... ఇవాళో, రేపో ఆమోదించక తప్పని పరిస్థితి. సో, ఆమోదించిన తర్వాత ప్రభుత్వం మైనార్టీలో పడిపోయినట్లే. బలపరీక్ష పెడితే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అంతదాకా వెళ్లకుండా... ఉప ఎన్నికలు నిర్వహిస్తారు.



    బీజేపీకి ఒంటరిగా 105 ఎమ్మెల్యేల బలం ఉంది. అధికారంలోకి రావాలంటే ఆ పార్టీకి అదనంగా కావాల్సింది 8 మంది ఎమ్మె్ల్యేలు. పిక్చర్ క్లియర్. ప్రస్తుతం లోక్ సభతో పాటూ కర్ణాటకలోనూ అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధించిన బీజేపీకి... మరో 8 సీట్లు గెలుచుకోవడం పెద్ద మేటరేమీ కాదు. అంతెందుకు మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలోని 28 లోక్ సభ స్థానాల్లో 25 బీజేపీకే దక్కాయి. ఇది చాలు కర్ణాటకలో బీజేపీ రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి. అందువల్ల నెక్ట్స్ సీఎం యడ్యూరప్పే అంటున్నారు కర్ణాటక బీజేపీ నేతలు.

    2018లో సరిపడా సంఖ్యా బలం లేక... సీఎం పీఠం ఎక్కలేకపోయిన యడ్యూరప్ప... 13 నెలల సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి... రెట్టించిన ఉత్సాహంతో అధికారాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిన్ను విరిగి మీద పడుతుండటంతో... అమెరికా పర్యటనలో ఉన్న కుమారస్వామి హడావుడిగా కర్ణాటకకు రాబోతున్నట్లు తెలిసింది.
    Published by:Krishna Kumar N
    First published:July 07, 2019, 05:59 IST