Home /News /national /

15 HOURS 40 KMS VIA FLOODED AREAS ITBP HEROES RESCUE WOMAN ON STRETCHER BA

సెల్యూట్ సోల్జర్స్, మహిళను స్ట్రెచర్‌పై మోసుకుంటూ 15 గంటలు, 40 కి.మీ ప్రయాణం

మహిళను స్ట్రెచర్‌పై మోసుకుని వెళ్తున్న ఐటీబీపీ హీరోస్ (Image; PTI)

మహిళను స్ట్రెచర్‌పై మోసుకుని వెళ్తున్న ఐటీబీపీ హీరోస్ (Image; PTI)

Solders carries Woman on Stretcher | ఆమెను భుజాల మీద మోస్తూ వరదలా పొంగుతున్న కాలువలు, కూలిపడుతున్న కొంచచరియల నుంచి తమను తాము కాపాడుకుంటూ, ఆమెను కాపాడుతూ ముందుకు సాగారు.

  ITBP Heros Saves Woman | సరిహద్దుల్లో దేశాన్ని కాపాడేందుకు సైనికులు ఎంతగా ప్రయత్నిస్తున్నారో, సరిహద్దులోపల ఉన్న భారతీయులను కాపాడేందుకు కూడా సైనికులు అంతే కష్టపడుతూ ఉంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు వారు ఎంతటి సాహసాలు చేస్తారో, ఎంతగా శ్రమిస్తారో చెప్పేందుకు ఇప్పుడు మీరు చదవబోయే ఘటన ఓ ఉదాహరణ. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్‌గఢ్ జిల్లాలో జరిగిందీ ఘటన. భారీ వర్షాలు కొట్టుకుపోయిన రోడ్లు, తెగిపోయిన రహదారుల మధ్య ఎంతో కష్టపడి ఓ మహిళను వైద్యం కోసం తరలించారు. ఓ కుగ్రామానిక చెందిన మహిళ ప్రమాదవశాత్తూ కొండ మీద నుంచి జారిపడిపోయింది. ఆగస్టు 20న ఈ ఘటన జరిగింది. ఆమె కాలు విరిగింది. నడవలేని పరిస్థితి. చికిత్స సరైన సమయానికి అందకపోవడం వల్ల బాధితురాలి పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఆమెను ఆస్పత్రికి చేర్చేందుకు హెలికాప్టర్ తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరస్థితుల కారణంగా రెండు రోజుల పాటు హెలికాప్టర్ వచ్చే అవకాశం లేకపోయింది. దీంతో 14వ బెటాలియన్‌కు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ( ఐటీబీపీ ) సైనికులు ధైర్యం చేశారు.

  సుమారు 22 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆమె ఉన్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడి నుంచి బాధితురాలిని ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. మొత్తం 25 మంది ఐటీబీపీ సైనికులు నడుం బిగించారు. ఓ స్ట్రెచర్ లాంటిదాన్ని ఏర్పాటు చేశారు. దానిపై ఆమెను పడుకోబెట్టి కట్టారు. అనంతరం ఆమెను భుజాల మీద మోస్తూ వరదలా పొంగుతున్న కాలువలు, కూలిపడుతున్న కొంచచరియల నుంచి తమను తాము కాపాడుకుంటూ, ఆమెను కాపాడుతూ ముందుకు సాగారు. అలా 15 గంటల పాటు శ్రమకోర్చి 40 కిలోమీటర్ల దూరం నడిచారు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అనువైన ఓ ప్రధాన రహదారికి చేర్చారు. అక్కడి నుంచి ఓ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిసింది.

  ఐటీబీపీని 1962లో ప్రవేశపెట్టారు. లద్దాక్‌లో కారకోరం పాస్ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లో జాచెప్ వరకు సుమారు 3488 కిలోమీటర్ల దూరాన్ని ఈ సరిహద్దు భద్రతా దళం పహారా కాస్తుంటుంది. 9000 అడుగుల ఎత్తు నుంచి 18,700 అడుగుల ఎత్తులో ఉండే ఔట్ పోస్టుల వద్ద కూడా నిత్యం అప్రమత్తంగా కాపలా కాస్తుంటుంది. ఐటీబీపీలో పనిచేసేవారంతా పర్వత ప్రాంతాల్లో డ్యూటీ చేయడంలో నిపుణులై ఉంటారు. వారికి అలాంటి ట్రైనింగ్ ఇస్తారు. పర్వతాలు ఎక్కడం, దిగడం వారి ట్రైనింగ్‌లో ప్రధాన భాగం. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వారికి ఎప్పుడూ మైండ్‌లో ఉంటుంది. ఈ ఏడాది మేలో చైనా ఎల్‌ఏసీలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో ఐటీబీపీకి చెందిన సైనికులు పాల్గొన్నారు. ఈ ఘటనలో భారత్‌కు చెందిన 20 మంది చనిపోగా, చైనా లిబరేషన్ ఆర్మీకి చెందిన 50 మందికి పైగా మరణించి ఉండవచ్చని అంచనా వేశారు. కానీ, చైనా ఎక్కడా ఆ లెక్కలను బయటపెట్టలేదు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Indian Army, Itbp, Uttarkhand

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు