చెరుకుతోటలో 15 అడుగుల భారీ కొండచిలువ

దీంతో కొండచిలువను చూసిన జనం భయంతో పరుగులు తీశారు. మరికొందరు ధైర్యం చేసి దాన్ని పట్టుకున్నారు.

news18-telugu
Updated: October 26, 2019, 10:21 AM IST
చెరుకుతోటలో 15 అడుగుల భారీ కొండచిలువ
15 అడుగుల భారీ కొండ చిలువ
  • Share this:
ఈ మధ్య పాములు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి. భయంకర విషసర్పాలు ఇళ్లలోకి, జనావాసాల్లోకి దూరిపోతున్నాయి. తాజాగా ఓ పెద్ద కొండచిలువ చెరుకుతోటలోకి చొచ్చుకొని వచ్చింది. పెద్దది అంటే మామూలు పెద్దది కాదు. దాదాపు ఆ కొండ చిలువ పొడవు 15 అడుగులు. దీంతో కొండచిలువను చూసిన జనం భయంతో పరుగులు తీశారు. మరికొందరు ధైర్యం చేసి దాన్ని పట్టుకున్నారు. తర్వాత అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.అనంతరం అటవీశాఖ అధికారులు ఆ కొండచిలువను తీసుకెళ్లి అడవుల్లో వదిలేశారు.First published: October 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు