Home /News /national /

140 CARTOON ILLICIT LIQUOR RECOVERED FROM A GOVERNMENT SCHOOL IN VAISHALI IN BIHAR STATE SK

క్లాస్ రూమే లిక్కర్ గోడౌన్.. రాత్రికి రాత్రే గది నిండా మద్యం బాటిళ్లు.. ఎలా వచ్చాయి?

స్కూల్‌లో లిక్కర్ బాటిల్స్

స్కూల్‌లో లిక్కర్ బాటిల్స్

Liquor Bottles in School: ఓ ప్రభుత్వ స్కూల్‌లో భారీ మొత్తంలో మద్యం లభ్యమైంది. విదేశీ మద్యం బాటిల్స్.. కార్టన్‌లకు కార్టన్‌లు బయటపడ్డాయి. మరి క్లాస్ రూమ్‌లోకి లిక్కర్ ఎలా వచ్చింది?

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తరగతి గదుల్లో ఏముంటాయి? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకోకండి. క్లాస్‌రూమ్‌లో బ్లాక్ బోర్డ్‌తో పాటు పిల్లలకు బెంచీలు, టీచర్లకు కుర్చీలు ఉంటాయి. కానీ ఓ స్కూల్లో మాత్రం లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి. తాగిపడేసిన ఖాళీ సీసాలు కావు. సీల్ కూడా తీయని.. ఫుల్ బాటిల్స్...! విద్యార్థులు ప్రతి రోజూ చదువుకునే తరగతి గదిలో పెద్ద మొత్తంలో మద్యం సీసాలు బయటపడ్డాయి. బీహార్‌ (Bihar)లో ఈ ఘటన చోటు చేసుకుంది. బీహార్‌లో మద్య నిషేధం అమల్లో ఉంది. అక్కడ చిన్న లిక్కర్ బాటిల్ కనిపించినా.. అది నేరం. పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. కానీ వైశాలి జిల్లాలోని ఓ ప్రభుత్వ స్కూల్‌లో భారీ మొత్తంలో మద్యం  (Illicit Liquor in School) లభ్యమైంది. విదేశీ మద్యం బాటిల్స్.. కార్టన్‌లకు కార్టన్‌లు బయటపడ్డాయి. మరి క్లాస్ రూమ్‌లోకి లిక్కర్ ఎలా వచ్చింది? దీని వెనక ఎవరున్నారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. వైశాలి జిల్లా లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బృందావన్ గ్రామంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఎప్పటిలానే బుధవారం ఉదయం ఆదేశ్ పాల్ అనే ఉపాధ్యాయుడు స్కూల్‌కి వెళ్లాడు. ఒక గదికి రెండు తాళాలు కనిపించాయి. అవి వారు రెగ్యులర్‌గా వాడే తాళాలు కాదు. భిన్నంగా ఉన్నాయి. తాము వేసిన తాళం పగులకొట్టి.. రెండు కొత్త తాళాలు వేసి ఉండడంతో.. అతడికి అనుమానం వచ్చింది. వెంటనే స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసి చెప్పాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పవన్ కుమార్ శుక్లా స్కూల్‌కి వెళ్లి పరిశీలించారు. అనంతరం గ్రామ సర్పంచ్‌తో పాటు పోలీసులకు సమాచారం అందించారు. వారు స్కూల్‌కు చేరుకొని.. గది తాళాలు పగులకొట్టారు. అందరూ కలిసి లోపలికి వెళ్లి చూస్తే.. అక్కడ షాకింగ్ దృశ్యం కనిపించింది. గది నిండా మద్యం బాటిళ్ల కార్టన్స్ కనిపించాయి. క్లాస్ రూమ్‌లో మొత్తం 140 కార్టన్‌ల మద్యం లభించిందని లాల్‌గంజ్ పోలీసులు తెలిపారు. ఆ మద్యం మొత్తాన్ని సీజ్ చేసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీహార్‌లో మద్యపాన నిషేధం అమల్లో ఉన్నందున.. లిక్కర్ మాఫియా చట్ట విరుద్ధంగా మద్యం సరఫరా చేస్తోంది. చాలా చోట్ల అక్రమ మద్యం కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో లిక్కర్ మాఫియానే స్కూల్‌లో మద్యం దాచి ఉండవచ్చని భావిస్తున్నారు. అర్ధరాత్రి వేళ మద్యాన్ని తరలించి..క్లాస్ రూమ్‌ని గోడౌన్‌గా వాడుకున్నారు. ఐతే దీని వెనక ఎవరెవరు ఉన్నారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు దొరికితే.. మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది. మద్యం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? చెక్ పోస్టులను ఎలా దాటిస్తున్నారు? అనే దానిపై స్పష్టత వస్తుంది. త్వరలోనే లిక్కర్ మాఫియాను పట్టుకుంటామని పోలీసుల వెల్లడించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bihar, Liquor, Liquor ban, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు