14 INJURED AS SUSPECTED MILITANTS HURL GRENADE OUTSIDE DCS OFFICE IN JKS ANANTNAG SK
రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. జమ్మూ కశ్మీర్లో గ్రెనేడ్ దాడి
అనంత్‌నాగ్‌లో ఉగ్రదాడి
కేంద్రం ఆర్టికల్ 370ని రద్దుచేసిన తర్వాత జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడి జరగడం ఇది రెండో సారి. అంతకుముందు సెప్టెంబరు 28న ఇదే తరహాలో సీఆర్పీఎఫ్ బలగాలపై దాడికి ప్రయత్నించారు టెర్రరిస్టులు.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్‌నాగ్‌లో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు గ్రెనేడ్ విసిరి పారిపోయారు. ఈ ఘటనలో ఓ చిన్నారి, ట్రాఫిక్ పోలీస్, జర్నలిస్ట్ సహా మొత్తం 14 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని అనంత్‌నాగ్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.
డిప్యూటీ కమిషన్ కార్యాలయం లక్ష్యంగా టెర్రరిస్టులు గ్రెనేడ్ దాడి చేశారని పోలీసులు వెల్లడించారు. గ్రెనేడ్ గురితప్పి రోడ్డుపై పడడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా దళాలు అనంత్‌నాగ్‌లో భారీగా మోహరించారు. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. కేంద్రం ఆర్టికల్ 370ని రద్దుచేసిన తర్వాత జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడి జరగడం ఇది రెండో సారి. అంతకుముందు సెప్టెంబరు 28న ఇదే తరహాలో సీఆర్పీఎఫ్ బలగాలపై దాడికి ప్రయత్నించారు టెర్రరిస్టులు.
AK Goyal, DIG South Kashmir: Terrorists lobbed a grenade at around 10:30 am today, in Lal Chowk area of Anantnag, injuring 10 persons, one of them is a police constable. This has been done with an objective to spread fear & terror among people. #JammuAndKashmirhttps://t.co/CmHYRtHovypic.twitter.com/4PszKTntVz