హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Lakhimpur హింసాకాండ: కేంద్ర మంత్రి కొడుక్కి 14రోజుల రిమాండ్ -మళ్లీ ప్రశ్నించనున్న UP Police

Lakhimpur హింసాకాండ: కేంద్ర మంత్రి కొడుక్కి 14రోజుల రిమాండ్ -మళ్లీ ప్రశ్నించనున్న UP Police

లఖీంపూర్ కేసులో ముద్దాయి ఆశిష్ మిశ్రా

లఖీంపూర్ కేసులో ముద్దాయి ఆశిష్ మిశ్రా

Ashish Mishra Judicial Custody : సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసిస్తోన్న రైతులను కారుతో తొక్కి చంపిన లఖీంపూర్ ఖేరీ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా ఎట్టకేలకు జైలులో పడ్డారు. ఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఆయన్ని విచారించిన పోలీసులు, అర్ధరాత్రి తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టి అటు నుంచే జైలుకు తరలించారు..

ఇంకా చదవండి ...

సంచలనం రేపిన లఖీంపూర్ ఖేరీ హింసాకాండ కేసులో ప్రధాన ముద్దాయి, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా టేని కొడుకు ఆశిష్ మిశ్రా ఎట్టకేలకు జైలులో పడ్డారు. నాటకీయ పరిణామాల మధ్య 12 గంటల సుదీర్ఘ ప్రశ్నావళి తర్వాత శనివారం రాత్రి ఆశిష్ ను అరెస్టు చేసిన యూపీ పోలీసులు.. అర్ధరాత్రి 1 గంట సమయంలో అతణ్ని జైలుకు తరలించారు. ఆశిష్ అరెస్టు, రిమాండ్ కు సంబంధించిన వివరాలను అధికారులు ఆదివారం నాడు మీడియాకు వెల్లడించారు..

లఖీంపూర్ ఖేరీ హింస కేసులో ప్రధాన ముద్దాయి ఆశిష్ మిశ్రాకు స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. శనివారం నాడు లఖింపూర్ ఖేరి క్రైం బ్రాంచ్ ఆఫీసులో 12 గంటల విచారణ తర్వాత అరెస్టును ప్రకటించిన పోలీసులు, ఆషిష్ కు వైద్య పరీక్షలు నిర్వహించి అర్ధరాత్రి తర్వాతగానీ జడ్జి ముందు ప్రవేశపెట్టారు. కోర్టువారు 14 రోజుల రిమాండ్ విధించగా, కేసు విచారణ కోసం తాము కూడా ఆశిష్ రిమాండ్ ను కోరుతామని పోలీసులు చెప్పారు.

కేసులో తదుపరి దర్యాప్తు కోసం ఆశిష్ ను పోలీసుల కస్టడీకి అప్పటించాల్సిందిగా మెజిస్ట్రేట్ కోర్టును కోరుతామని, అందుకోసం ఇప్పటికే దరఖాస్తులు పెట్టామని, దీనిపై ఈనెల 11న(సోమవారం) జడ్జి నిర్ణయం చెబుతారని సీనియర్ అధికారి యాదవ్ తెలిపారు. అంతకుముందు, డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కొడుకు తీరుపై అసంతృప్తి వెళ్లగక్కారు. విచారణ సందర్భంగా ఆశిష్‌ పోలీసులకు సహకరించలేదని, తదుపరి కస్టడీలోనైనా అతని నుంచి నిజాలు రాబడుతామని అన్నారు.

లఖీంపూర్ లో రైతులపై హింసాకాండను నిరసిస్తూ రైతుల సంఘాలు సుదీర్ఘ ఉద్యమ కార్యాచారణకు పిలుపునిచ్చాయి. ఈనెల 12న లఖీంపూర్ లో భారీ ఎత్తున అమరలుల సంస్మరణ సభను నిర్వహిస్తామన్న కిసాన్ మోర్ఛా.. దసరా పండుగ నాడు రాక్షసుల ప్రతిమలకు బదులుగా మోదీ-షా దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చింది. ఈనెల 18న దేశవ్యాప్త రైల్ రోకో, ఈనెల 26న లక్నోలో మహాపంచాయత్ తలపెట్టినట్లు రైతుల సంఘాలు తెలిపాయి.

First published:

Tags: Farmers Protest, Uttar pradesh

ఉత్తమ కథలు