Home /News /national /

131 MONKEYPOX CASES CONFIRMED MONKEYPOX IN 19 COUNTRIES SAYS WORLD HEALTH ORGANISATION PVN

Monkeypox : కలవరపెడుతున్న మంకీపాక్స్..19 దేశాల్లో మంకీపాక్స్ కేసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Monkeypox in 19 countries : కరోనా మహమ్మారి (Coronavirus) ఇంకా మనల్ని వదలివెళ్లలేదు. 2020 నుంచి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎంతో మంది జీవితాన్ని నాశనం చేసింది. ఆ కరోనా సృష్టించిన విధ్వంసాన్ని ఇంకా మర్చిపోకముందే మరిన్ని కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. తాజాగా కొత్త వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తోంది. అదే మంకీపాక్స్ (Monkeypox Virus).

ఇంకా చదవండి ...
Monkeypox in 19 countries : కరోనా మహమ్మారి (Coronavirus) ఇంకా మనల్ని వదలివెళ్లలేదు. 2020 నుంచి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎంతో మంది జీవితాన్ని నాశనం చేసింది. ఆ కరోనా సృష్టించిన విధ్వంసాన్ని ఇంకా మర్చిపోకముందే మరిన్ని కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. తాజాగా కొత్త వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తోంది. అదే మంకీపాక్స్ (Monkeypox Virus). ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్‌ వేగంగా విస్తరిస్తోంది. మంకీపాక్స్​ వైరస్​ ఇప్పటివరకు 19 దేశాలకు విస్తరించింది. తాజాగా ఆస్ట్రియా, స్లొవేనియా, చెక్‌ రిపబ్లిక్‌ దేశాల్లో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల బెల్జియంలో మ్యుజిక్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఓ వ్యక్తిలో మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించాయని చెక్‌రిపబ్లిక్‌ అధికారులు వెల్లడించారు. అతడిని హాస్పిటల్ లో చేర్పించి పరీక్షలు నిర్వహించగా మంకీపాక్స్‌ నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఇక ఆస్ట్రియాకు చెందిన ఓ వ్యక్తి మంకీపాక్స్‌ లక్షణాలతో ఈ ఆదివారం ఆస్పత్రిలో చేరాడు. అనంతరం జరిపిన పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ అయ్యిందని వియన్నా వైద్యాధికారులు తెలిపారు. మరోవైపు కానరీ ద్వీపం నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్‌ లక్షణాలు గుర్తించి పరీక్షించగా వ్యాధి సోకినట్లు తేలిందని స్లొవేనియా అధికారులు తెలిపారు.

అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు 131 కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 106 అనుమానిత కేసులు ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. దీంతో ఆఫ్రికా కాకుండా ఇతర దేశాల్లోనే మొత్తం 237 మంకీపాక్స్‌ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ వైరస్ మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తోంది. అయితే దీనివల్ల ముప్పు మాత్రం తక్కువేనని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రెండు వందలకుపైగా కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ మంకీపాక్స్‌ వైరస్‌ మ్యుటేషన్‌ చెందిందని చెప్పడానికి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కేసుల పెరుగుదలకు కారణాలేంటనే దానిపై ఇంకా స్పష్టత లేదని తెలిపింది. వీటి మూలాలు కనుక్కోవడంతో పాటు వైరస్‌ లో మార్పులను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది. జ్వరం, ముఖంపై దద్దుర్లు, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు కనిపించే ఈ వ్యాధి వల్ల ఇప్పటివరకు ఒక్క మరణం కూడా సంభవించలేదు.

ALSO READ  Fire in Hospital : హాస్పిటల్ లో అగ్నిప్రమాదం..మంటల్లో కాలిపోయిన 11మంది చిన్నారులు

కాగా, శృంగారం ద్వారా కూడా మంకీపాక్స్ వ్యాపించే అవకాశం ఉందా అనే విషయంపై శాస్త్రవేత్తలు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. మంకీపాక్స్ సోకిన వ్యక్తితో శృంగారంలో పాల్గొనడం వల్ల స్త్రీ, పురుషులు ఇద్దరికీ మంకీపాక్స్ సోకే ప్రమాదం ఉందని నిపుణుల చెబుతున్నారు . మంకీపాక్స్ వ్యాధి సోకిన వారి నుండి ఇది ఇతరులకు సోకడం చాలా తేలిక. శ్వాసనాళాలు, గాయాలు, ముక్కు, నోరు లేదా కళ్ళ ద్వారా ఇది ఇతరుల శరీరంలోకి ప్రవేశిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. మంకీపాక్స్ వైరస్ లైంగిక సంపర్కం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించిస్తున్నారు. మంకీపాక్స్ వైరస్ లైంగిక సంపర్కం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందనే నిపుణులు హెచ్చరికలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

అసలేంటీ వైరస్‌?

మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది కూడా స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందినదే. అంటే మనదేశంలో తట్టు, అమ్మవారిలానే ఇది కూడా కనిపిస్తుంది. ఈ వైరస్‌ను మొదట 1958లో మొదటిసారి కోతుల్లో గుర్తించారు. అందువల్ల దీనికి మంకీ పాక్స్ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత మనుషులకు సోకింది. 1970ల్లో తొలిసారి మనుషుల్లో గుర్తించారు. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. అందులోనూ ఎక్కువగా ఎలుకలు, చంచులు, ఉడతల నుంచి వ్యాపిస్తుంది. ఈ మంకీపాక్స్ వ్యాధి సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా సోకుతుంది. గాలి తుంపర్ల ద్వారా, వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్ వ్యాధి ఎవరికైనా సోకిన తర్వాత.. శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సుమారు 6 నుంచి 13 రోజుల సమయం పడుతుంది. ఒక్కోసారి 21 రోజులు సమయం తీసుకుంటుంది.

లక్షణాలు (Monkeypox Symptoms)

మంకీపాక్స్ సోకిన వారిలో స్మాల్‌పాక్స్ మాదిరిగానే..ముఖం, కాళ్లుచేతులపై బొబ్బలు, దద్దుర్లు కనిపిస్తాయి. ఒక్కోసారి శరీరమంతా వ్యాపిస్తాయి. జ్వరం, తలనొప్పి, నడుము నొప్పి, కండరాల నొప్పి, వాపు, అలసట ఉంటుంది. కొందరిలో ఇలాంటి లక్షణాలేవీ కనిపించవు. ఈ వ్యాధి బారినపడిన వారిలో చాలా మంది వారాల వ్యవధిలోనే కోలుకుంటారు. తక్కువ మందికి మాత్రమే ప్రాణాపాయంగా ఉంటుంది. ప్రతి 10 మందిలో ఒకరికి మంకీపాక్స్ ప్రాణాంతంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటిచాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Monkeypox

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు