హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

తరగతిలో విద్యార్థులను చావబాదిన ఉపాధ్యాయుడు.. కారణం తెలిస్తే నోరెళ్ల బెడతారు..

తరగతిలో విద్యార్థులను చావబాదిన ఉపాధ్యాయుడు.. కారణం తెలిస్తే నోరెళ్ల బెడతారు..

నిరసన తెలియజేస్తున్న చిన్నారుల తల్లిదండ్రులు

నిరసన తెలియజేస్తున్న చిన్నారుల తల్లిదండ్రులు

Jharkhand: క్లాస్ లో ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. తను చెప్పిన మాటలు వినలేదని రెచ్చిపోయాడు. విద్యార్థులను కర్రలతో చావబాదాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Jharkhand, India

జార్ఖండ్ లోని (Jharkhand)  గుమ్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గుమ్లా పరిధిలో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయుడు చేసిన పనికి 13 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారు. ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది. గుమ్లాలో ఉన్న సెయింట్ మైఖేల్ అనే పాఠశాలలోని వికాస్ సిరిల్ అనే ఉపాధ్యాయుడు గుమ్లాలోని సెయింట్ మైఖేల్ పాఠశాలకు చెందిన వికాస్ సిరిల్ అనే ఉపాధ్యాయుడు తన ఆదేశాల మేరకు 6వ తరగతి విద్యార్థులు డ్యాన్స్ చేయడానికి నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాట వినని వారందరిని చావబాదాడు.

కర్రలతో చావబాదాడు. ఈ క్రమంలో విద్యార్థులకు తీవ్రమైన గాయాలయ్యాయి. విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించినా ఫలితం లేకపోయింది. విద్యార్థులు ఇంటికి వెళ్లి తమ బాధను తల్లిదండ్రులతో చెప్పుకున్నారు. వీరిలో కొందరికి తీవ్రమైన గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరారు.

టీచర్లు జంతువులలా ప్రవర్తిస్తున్నారు: తల్లిదండ్రులు

తమ పిల్లల శరీరానికి గాయాలు అవ్వడం చూసిన తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే.. తల్లిదండ్రులు పాఠశాలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయులు తమ వార్డుల భవిష్యత్తుతో ఆడుకునే‘జంతువులు’గా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉపాధ్యాయుడిపై దాడి చేయడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 13 మంది విద్యార్థుల నుంచి దరఖాస్తులు అందాయని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశుతోష్ సింగ్ తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామని, విచారణ ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంతలో, తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా, బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శిశిర్ కుమార్ సింగ్ కూడా ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా దేశ మంతాట దుర్గాపూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు భక్తులు వివిధ రూపాలలో అమ్మవారిని కొలుస్తారు. కొందరు తొమ్మిది రోజుల పాటు ఉపవాసాలు కూడా ఉంటారు. అయితే.. అనేక చోట్ల దాండియా డ్యాన్స్, గర్భా ప్రదర్శన చేస్తుంటారు. వీటిల్లో పోటీ కూడా ఉంటుంది. ఎవరైతే గర్భాడ్యాన్స్ బాగా చేస్తారో వారికి ప్రత్యేకంగా బహుమతిని కూడా ఇస్తారు.

అయితే.. ముంబైలోకి (mumbai) లోకల్ ట్రైన్ లో (local trin)  కొందరు మహిళలు ట్రైన్ లోనే ఒక సమూహంగా ఏర్పాడ్డారు. అందరు కలిసి గర్బా డ్యాన్స్ చేశారు. లోకల్ ట్రైన్ లో కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లే యువతులు, మహిళలు అంత గుంపులుగా ఏర్పడి గార్భ ప్రదర్శన చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యనే కొందరు వినూత్నంగా రాజస్థాన్ లో స్విమ్మింగ్ పూల్ లో గుంపులుగా గర్భా డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Jharkhand

ఉత్తమ కథలు