Home /News /national /

13 OPPOSITION LEADERS EXPRESS CONCERN OVER RECENT COMMUNAL VIOLENCE QUESTION PM MODI SILENCE PVN

Opposition Parties : అంత జరుగుతున్నా మౌనమేల మోదీ!..13 పార్టీల సంయుక్త ప్రకటన

ప్రదాని మోదీ, సోనియా గాందీ(ఫైల్ పొటో)

ప్రదాని మోదీ, సోనియా గాందీ(ఫైల్ పొటో)

Opposition leaders on recent communal violence : దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి.

Opposition leaders on recent communal violence : దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI) మౌనం వహించడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. శ్రీరామ నవమి సందర్భంగా దేశంలోని పలు చోట్ల చోటుచేసుకున్న మత ఘర్షణలను హైలైట్‌ చేస్తూ 13 విపక్ష పార్టీలు(13 Opposition Parties) శనివారం రోజున సంతకాల సేకరణ ద్వారా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్‌ శరద్ పవార్, టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్, జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐకి చెందిన డి రాజా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా తదితరుల పేర్లతో ఈ ఉమ్మడి ప్రకటన జారీ అయ్యింది. అయితే.. శివసేన, ఆమ్‌ఆద్మీ పార్టీ మాత్రం ఈ లిస్ట్‌లో లేకపోవడం గమనార్హం.

మతపరమైన ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ మౌనంగా ఉండడం దిగ్భ్రాంతి కలిగించిందని ఆ సంయుక్త ప్రకటనలో ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. శాంతి, సామరస్యాన్ని కాపాడాలని, మత హింసకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. "దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన మత హింసాకాండను తీవ్రంగా ఖండిస్తున్నాం. సంబంధిత వార్తలపై తీవ్ర ఆందోళన చెందుతున్నాం. సాయుధ మతపరమైన ఊరేగింపులు, రెచ్చగొట్టే ప్రసంగాల, మతపరమైన హింసకు దారితీస్తున్నాయి. ఇది ఎంతో ఆందోళన కలిగిస్తుంది. మతోన్మాదాన్ని ప్రచారం చేసే వాళ్ల మాటలను, వాళ్ల చర్యలను ఖండించడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారు. ఆయన మౌనం.. ఇటువంటి ప్రైవేట్ సాయుధ గుంపులను అధికారికంగా ప్రోత్సాహించినట్లే అవుతుందని, వాళ్లు సంఘంలో విలాసాల్ని అనుభవిస్తున్నారనడానికి ఒక స్పష్టమైన సాక్ష్యంగా నిలిచిందని" విపక్షాలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.


అదేవిధంగా, ఆహారం, దుస్తులు, విశ్వాసం, పండుగలు, భాషకు సంబంధించిన సమస్యలను అధికారంలోని కొన్ని వర్గాలు ఉపయోగించుకుంటున్న తీరు చాలా విచారకమని ప్రతిపక్ష పార్టీలు ఆవేదన వ్యక్తం చేశాయి. అనేక వైవిధ్యాలను గౌరవించి వేడుకలను పూర్తి స్థాయిలో జరుపుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని 13 పార్టీల రాజకీయ నేతలు తెలిపారు. శాంతిని కాపాడాలని సమాజంలోని అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేశారు.

ALSO READ RSS Worker : ముస్లిం వ్యక్తి హత్య జరిగిన 24 గంటల్లోనే..RSS కార్యకర్తను నరికి చంపేశారు!

మరోవైపు,బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసహనం,ద్వేషం,మతోన్మాదం దేశాన్ని చుట్టుమడుతున్నాయని మండిపడ్డారు. వీటిని వెంటనే ఆపకపోతే పునర్నిర్మించలేని స్థితికి సమాజం దిగజారుతుందని ఓ సంపాదకీయంలో ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలో హిజాబ్ వివాదం, రామనవమి సందర్భంగా దేశంలో ఘర్షణలు, జేఎన్​యూలో మాంసాహారంపై గొడవ వంటి అంశాలనూ తన ఆర్టికల్ ​లో పరోక్షంగా ప్రస్తావించారు సోనియా. అధికారంలో ఉన్నవారికి అనుకూలమైన భావజాలం లేకపోతే అణచివేస్తున్నారని సోనియా ధ్వజమెత్తారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని దేశ యంత్రాంగాన్ని వారిపై ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. సామాజిక కార్యకర్తలను బెదిరించి నోరుమూయిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు వార్తలను విష ప్రచారం చేస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Bjp, Congress, Pm modi, Sonia Gandhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు