news18-telugu
Updated: November 26, 2020, 10:27 AM IST
నాటి ముంబై మారహోమం నాటి దృశ్యం (ఫైల్ ఫోటో)
ముంబైలో ఉగ్రవాదులు 26/11 నాడు సృష్టించిన దారుణ మారణహోమాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఈ మారణకాండకు 12 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబర్ 26న సముద్ర మార్గం ద్వారా ముంబై చేరుకున్న పది మంది ఉగ్రవాదులు.. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 18 మంది భద్రతా దళాలు సహా మొత్తం 166 మంది చనిపోయారు. ఏటీఎస్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబై అడిషనల్ పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే సహా పలువురు పోలీసు అధికారులు మృతి చెందారు. 60 గంటల సుధీర్ఘ ఆపరేషన్ ద్వారా భద్రతా దళాలు 9 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఘటనలో సజీవంగా చిక్కిన అజ్మల్ కసబ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. నవంబర్ 21, 2002న అతడిని ఉరి తీశారు. ఈ ఉగ్రదాడికి ప్రధాన సూత్రదారి అయిన హఫీజ్ సయీద్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్నాడు.
ఈ ఉగ్రదాడి జరిగి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఘటనలో ప్రాణాలు అర్పించిన భద్రతా సిబ్బందికి నివాళులు అర్పించనుంది మహారాష్ట్ర ప్రభుత్వం. దక్షిణ ముంబైలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం జరగనుంది. మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ, సీఎం ఉద్దవ్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కరోనా నిబంధనల నేపథ్యంలో అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఈసారి జరగబోయే కార్యక్రమంలో అనుమతి ఇవ్వనున్నారు.
Published by:
Kishore Akkaladevi
First published:
November 26, 2020, 10:19 AM IST