Home /News /national /

12 DEAD AS WALL COLLAPSES AT SALT FACTORY IN MORBI GUJARAT PAH

Wall Collapses: పెను ప్రమాదం.. కుప్పకూలిన గోడ.. 12 మంది దుర్మరణం..

ఫ్యాక్టరీలో ప్రమాదం

ఫ్యాక్టరీలో ప్రమాదం

Gujarat: మోర్బీలోని ఉప్పు కర్మాగారంలో గోడ ఒక్కసారిగా కుప్ప కూలింది. ఈ ఘటనలో 12 మంది అక్కడిక్కడే విగతజీవులుగా మారిపోయారు.

గుజరాత్ లోని (Gujarat) బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మోర్బిలోని ఉప్పు కర్మాగారంలో గోడకూలింది. ఈ ఘటనలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కొంత మంది ప్రమాదంలో చిక్కుకున్నారు. హల్వాద్ జిఐడిసిలోని సాగర్ సాల్ట్ ఫ్యాక్టరీలో (Salt Factory In Morbi) ఈ పెను ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు.





ఘటనపై రాష్ట్ర మంత్రి బ్రిజేష్ మెర్జా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షత గాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల కుటుంబాలకు PMNRF నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు ఇవ్వబడుతుంది. గాయపడిన వారికి రూ.50,000 అందజేస్తాం పీఎంఓ అధికారులు తెలపారు.

Vadodara Building Collapse

గుజరాత్... వడోదరలోని... బవమాన్‌పురాలో... ఓ నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. రాత్రివేళ ఇలా జరగడంతో... ఆ సమయంలో చాలా మంది నిద్రలో ఉన్నారు. ఈ ప్రమాదంలో... ఇద్దరు పురుషులు, ఓ మహిళ స్పాట్ లోనే చనిపోయారు. గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అతని వయస్సు 18 ఏళ్లు అని అధికారులు తెలిపారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈమధ్య మహారాష్ట్రతోపాటూ... గుజరాత్‌లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడు కూడా కురుస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో... ఆ భవనం... వర్షానికి బాగా నానిపోయి... కూలిపోయి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం చుట్టుపక్కల పాత భవనాలు ఏవైనా ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈమధ్యే... ముంబైలో... మూడు అంతస్థుల భవనం సగం వరకూ కూలిపోయింది. 10 మంది ప్రాణాలు పోయాయి. అందువల్ల ఇలాంటి భవనాలు ఇంకా ఎకకడెక్కడ ఉన్నాయనే అంశంపై అధికారులు దృష్టిసారిస్తున్నారు. 20 ఏళ్లకు మించిన భవనాలు, బీటలు వారిన భవనాల్లో ఉండేవారు... అవి పటిష్టంగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Building Collapse, Gujarat

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు