మహారాష్ట్రలోని (maharashtra) నాసిక్ లో ఘోర ప్రమాదం సంభవించింది. నాసిక్-ఔరంగాబాద్ హైవేపై డీజిల్ రవాణా చేస్తున్న ట్రైలర్ ట్రక్కును, బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే బస్సు మొత్తం మంటలు అంటుకున్నాయి. బస్సులో 12 మందికి పైగా చనిపోయినట్లు గుర్తించారు. అదే విధంగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ , (PM MOdi) ల్లో సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి ₹ 50,000 చొప్పున సహాయంను ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం డాక్టర్లకు సూచించారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులను మహారాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆ రాష్ట్ర మంత్రి దాదా భూసే తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్(Uttarakhand) రాష్ట్రంలోని ఉత్తరకాశీలో గత మంగళవారం చోటుచేసుకున్న భారీ హిమపాతంలో మృతుల సంఖ్య 26కు చేరింది.
శుక్రవారం మరో 10 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ సంస్థ ఈ విషయం వెల్లడించింది. కశ్మీర్ లోని ఓ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్న 29 మంది ట్రెయినీ పర్వతారోహకులు గత మంగళవారం ఉత్తరకాశీలోని ఓ పర్వతం బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. అనంతరం పర్వతాన్ని అధిరోహించడం మొదలుపెట్టారు. ఉదయం 9 గంటల సమయంలో 16 వేల అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత ఒక్కసారిగా హిమపాతం సంభవించింది. దీంతో పర్వతారోహకులంతా ఆ మంచు దిబ్బల కింద గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రెస్క్యూ టీమ్స్‌ను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. ఆర్మీ , నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(NDRF),ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(SDRF),ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ తదితర బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. అటు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లను సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Maharashtra