హోమ్ /వార్తలు /జాతీయం /

పనిచేసే ప్రభుత్వాలకే ఓటు వేయండి... ఢిల్లీలో వృద్ధ ఓటర్ అభ్యర్థన...

పనిచేసే ప్రభుత్వాలకే ఓటు వేయండి... ఢిల్లీలో వృద్ధ ఓటర్ అభ్యర్థన...

బచన్ సింగ్ (Image: Twitter/ANI)

బచన్ సింగ్ (Image: Twitter/ANI)

6th Phase Lok Sabha Election 2019 : 2015 వరకూ ఆయన సైకిల్‌పై పోలింగ్ బూత్‌కి వచ్చాడు. ఈసారి మాత్రం పోలింగ్ అధికారులు ఆయన్ని కారులో తీసుకొచ్చారు.

    వయసనేది ఓ సంఖ్య మాత్రమే అంటున్నాడు 111 ఏళ్ల బచన్ సింగ్. ఢిల్లీలో అత్యంత వృద్ధ ఓటర్ ఆయనే. తిలక్ విహార్‌లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు వేశాడు. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆయన సైకిల్‌పై పోలింగ్ బూత్‌కి వచ్చేవాడు. ఈసారి మాత్రం పోలింగ్ అధికారులు ఆయన్ని కారులో తీసుకొచ్చారు. తర్వాత ఆయన్ను చక్రాల కుర్చీలో పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. మూడు నెలల కిందట బచన్ సింగ్‌కి పెరాలసిస్ సోకింది. ఆ పక్షవాతం వల్ల ఆయన ఇదివరకట్లా సరిగా మాట్లాడలేకపోతున్నాడు. కానీ ఆయనకు ఓటు విలువ తెలుసు. తాను పనిచేసే వారికే ఓటు వేస్తానన్నాడు. చిత్రమేంటంటే... అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి ఉందనీ, దాని కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నాడని ఆయనకు తెలియదు. ప్రతిసారీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య జరుగుతున్నాయని బచన్ సింగ్ భావిస్తున్నట్లు 63 ఏళ్ల ఆయన చిన్న కొడుకు జస్బీర్ సింగ్ తెలిపారు. 1951 నుంచీ బచన్ సింగ్ ఏ ఎన్నికల్లోనూ ఓటు వెయ్యడం ఎగ్గొట్టలేదని తెలిపాడు.


    బచన్ సింగ్ ఇప్పటికీ తన వంట తనే చేసుకుంటాడు. స్థానిక గురుద్వారాలో సేవ చేస్తూ ఉంటాడు. మాజీ ప్రధాని నెహ్రూ కాలం నుంచీ ఈ కుటుంబం కాంగ్రెస్‌కే ఓటు వేస్తోంది. ఇప్పుడు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు.


     


    ఇవి కూడా చదవండి :


    రవి ప్రకాశ్ ఎక్కడ..? గాలిస్తున్న పోలీసులు... సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్... నో క్లూ...


    ఏపీలో కింగా, కింగ్ మేకరా... నేడు తేల్చనున్న పవన్ కళ్యాణ్...


    IPL Final Match : ఫైనల్ మ్యాచ్‌కి సిద్ధమైన CSK, MI... జోరుగా బెట్టింగ్, బ్లాక్ టికెట్ల దందా


    ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్... ఒక్కో ఎమ్మెల్యే రేటు రూ.30 కోట్లు..?

    First published:

    Tags: Delhi Lok Sabha Elections 2019

    ఉత్తమ కథలు