గణేష్ నిమజ్జనంలో విషాదం.. 11 మంది మృతి..

ప్రమాద సమయంలో పడవలో 16 మంది ఉన్నారని,11 మంది మృతి చెందారని స్థానిక ఎస్పీ అఖిల్ పటేల్ తెలిపారు. అయితే స్థానికులు మాత్రం పడవలో ఉన్నవాళ్ల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చునని చెబుతున్నారు.

news18-telugu
Updated: September 13, 2019, 8:48 AM IST
గణేష్ నిమజ్జనంలో విషాదం.. 11 మంది మృతి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని ఖట్లపుర ఘాట్‌లో శుక్రవారం ఉదయం గణేష్ నిమజ్జనం సందర్భంగా పడవ బోల్తా పడి 11 మంది మృతి చెందారు.మరో ఐదుగురు గల్లంతయ్యారు. 11 మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రమాద సమయంలో పడవలో 16 మంది ఉన్నారని,11 మంది మృతి చెందారని స్థానిక ఎస్పీ అఖిల్ పటేల్ తెలిపారు. అయితే స్థానికులు మాత్రం పడవలో ఉన్నవాళ్ల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చునని చెబుతున్నారు. గల్లంతయిన వారి కోసం తాము కూడా వెతుకుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం అక్కడ 40 మంది పోలీసులతో కూడిన సహాయక బృందం,గజ ఈతగాళ్లు గల్లంతయిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన టీమ్ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది.



First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు