మోడీ కంటే మన్మోహనే బెటర్..!

Shiva Kumar Addula | news18
Updated: May 31, 2018, 9:44 AM IST
మోడీ కంటే మన్మోహనే బెటర్..!
అర్వింద్ కేజ్రీవాల్(ఫైల్ ఫోటో)
  • News18
  • Last Updated: May 31, 2018, 9:44 AM IST
  • Share this:


ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు గుప్పించారు. ఆ క్రమలో ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోడీ కాలేజీ డిగ్రీ నకిలీదని ఆరోపించారు. దేశ ప్రధానికి చదవడం.. రాయడం.. రావాలన్నారు. ఇలా మోడీపై సెటైర్లు వేసేందుకు మన్మోహన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

‘మన్మోహన్ సింగ్ లాంటి విద్యావంతుడైన ప్రధానిని దేశ ప్రజలు మిస్సవుతున్నారు. ఆయనలాంటి విద్యావంతుడైన వ్యక్తే ప్రధానిగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు.’  అని ట్విటర్‌లో కేజ్రీవాల్ పేర్కొన్నారు.
కాగా, రాజకీయాల్లోకి రాక ముందు మన్మోహన్ మంచి విద్యావంతుడు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నాడు. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీడీ)కి సేవలందించారు. ఢిల్లీ స్కూల్‌లో ఎకానామిక్స్ అధ్యాపకుడిగానూ పనిచేస్తారు.  అంతేకాదు 1982-85 మధ్య కాలంలో రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గానూ సేవలందించారు.

ఐతే ఇదే కేజ్రీవాల్ గతంలో మన్మోహన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. యూపీఏ ప్రభుత్వంపై విరుకుచుకుపడిన కేజ్రీవాల్.. మన్మోహన్ సింగ్‌ను ద్రుతరాష్ట్రుడితో పోల్చారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెెస్ పార్టీ.. మన్మోహన్ సింగ్‌ను  ముందుకు తెచ్చి ప్రధానిని చేసిందని 2013లో ట్వీట్ చేశారు. 2015 ఢిల్లీ ఎన్నికల సమయంలో బీజేపీ సీఎం అభ్యర్థికి కిరణ్ బేడీని  ‘బీజేపీ మన్మోహన్ సింగ్‌’ గా అభివర్ణిస్తూ సెటైర్లు వేశారు. గతంలో మన్మోహన్‌పై ఇన్ని విమర్శలు చేసిన కేజ్రీవాల్.. ఇప్పుడు పొగడడం గమనార్హం.
Published by: Shiva Kumar Addula
First published: May 31, 2018, 9:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading