హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

బతికున్నా చనిపోయాడని పెన్షన్ ఆపేశారు..102 ఏళ్ల వయస్సులో పెద్దాయన వినూత్నన నిరసన

బతికున్నా చనిపోయాడని పెన్షన్ ఆపేశారు..102 ఏళ్ల వయస్సులో పెద్దాయన వినూత్నన నిరసన


నేను బతికే ఉన్నా అంటూ వృద్ధుడి వినూత్న నిరసన

నేను బతికే ఉన్నా అంటూ వృద్ధుడి వినూత్న నిరసన

Old Man Varity Protest For Pension : అతని వయస్సు 102. ఇంకా బతికే ఉన్నాడు. అయితే ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో అతను చనిపోయినట్లు ఉంది. దీంతో అతని పెన్షన్‌ను నిలిపివేశారు. నేను బతికే ఉన్నాను మొర్రో అని ఆ పెద్దాయన ఎంత మొరపెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవట్లేదు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Old Man Varity Protest For Pension : అతని వయస్సు 102. ఇంకా బతికే ఉన్నాడు. అయితే ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో అతను చనిపోయినట్లు ఉంది. దీంతో అతని పెన్షన్‌ను నిలిపివేశారు. నేను బతికే ఉన్నాను మొర్రో అని ఆ పెద్దాయన ఎంత మొరపెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. దీంతో ఆ వృద్ధుడు(Old Man) చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌భుత్వ రికార్డుల్లో చాలా త‌ప్పులు దొర్లుతున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా బ‌తికి ఉన్న వారిని చంపేయ‌డం, చ‌నిపోయిన వారిని బ‌తికించ‌డం లాంటివ‌న్ని కూడా ప్ర‌భుత్వ రికార్డుల్లోనే జ‌రుగుతుంటాయి. ఇక్క‌డ కూడా స‌రిగ్గా అలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. హర్యానా(Haryana)లోని రోహ్‌తక్‌(Rohtak) జిల్లా గంద్రా గ్రామానికి చెందిన దులీ చంద్(Duli Chand)​ వయస్సు 102 ఏళ్లు. దులీ చంద్​కు మార్చి నుంచి వృద్ధాప్య పింఛను ఆగిపోయింది. తనకు ఎందుకు పెన్షన్ ఇవ్వట్లేదు అని అధికారులని అడిగితే మీరు చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది కాబట్టి మీకు పెన్షన్ ఇవ్వలేం అని అధికారులు చెప్పిన మాట విని దులీ చంద్ అవాక్కయ్యాడు. తాను బతికే ఉన్నానని నిరూపించేందుకు అన్ని రకాలుగా అధికారులకు నచ్చజెప్పేందుకు దులీ చంద్ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో దులీ చంద్ వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. గురువారం దులీ చంద్ రోహ్‌తక్ నగరంలోని మానసరోవర్ పార్క్ నుండి కెనాల్ రెస్ట్ హౌస్ వరకుమెడలో నోట్ల దండతో పెళ్లికొడుకులా ముస్తాబై, గుర్రపు బండి ఎక్కి మేళతాళాలు, యువకుల నృత్యాల మధ్య ఊరేగింపు నిర్వహించాడు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులతో దులీ చంద్ తన బాధను చెప్పుకున్నాడు. గత ఆరు నెలలుగా తన వృద్ధాప్య పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని,ప్రభుత్వ రికార్డుల్లో నేను చనిపోయినట్లు చూపించారని, అప్పటి నుంతాను బతికే ఉన్నానని అన్ని రకాలుగా హామీ ఇచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని మీడియా ప్రతినిధులతో దులీ చంద్ చెప్పారు. తన ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , కుటుంబ ఐడీ మరియు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లతో సహా తన గుర్తింపు రుజువులను దులీ చంద్ చూపించాడు.ఇప్పటికైనా తాను బతికే ఉన్నట్లు నమ్మి, పెన్షన్​ వచ్చేలా చూడాలని దులీ చంద్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులని కోరాడు. మాజీ మంత్రి, బీజేపీ నేత మనీశ్​ గ్రోవర్​ను కలిసి ఇదే విషయంపై విజ్ఞాపన పత్రం అందజేశాడు దులీ చంద్.
Billionaire : అప్పు చేసి ఆ షేర్లు కొన్న 20 ఏళ్ల విద్యార్థి..కేవలం నెల రోజుల్లోనే 600 కోట్లు లాభం పొందాడు


కాగా,చంద్ మనవడు మాట్లాడుతూ..పెన్షన్ విషయమై హర్యానా ముఖ్యమంత్రి గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్‌కు సుమారు నెల రోజుల క్రితం ఫిర్యాదు చేశామని, అయినా స్పందన లేదని చెప్పారు. గురువారం రోహ్‌తక్‌ సిటీలో దులీ చంద్ ఊరేగింపు ప్రదర్శన సందర్భంగా చంద్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హర్యానా యూనిట్ మాజీ అధ్యక్షుడు నవీన్ జైహింద్ కూడా ఉన్నారు. వృద్ధాప్య పింఛను వెంటనే పునరుద్ధరించాలని జైహింద్‌ డిమాండ్‌ చేశారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని, ఇప్పటి వరకు ఎటువంటి ఖచ్చితమైన చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వృద్ధులకు పింఛను నిలిపివేసి వేధింపులకు గురిచేయడం దురదృష్టకరమని అన్నారు. ముఖ్యమంత్రి ఫిర్యాదుల పరిష్కార సెల్‌లో ఫిర్యాదు చేసినా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని అన్నారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Aasara pension, Haryana, Old man

ఉత్తమ కథలు