101 OLD MONK RUM BOTTLES AND CHICKEN OFFERED FOR GOD AT PORUVAZHY PERUVIRUTHY MALANADA DURYODHANA TEMPLE SS
దేవుడికి నైవేద్యంగా 101 రమ్ము బాటిళ్లు... ఆ ఆలయంలో వింత ఆచారం
దేవుడికి నైవేద్యంగా 101 రమ్ము బాటిళ్లు... ఆ ఆలయంలో వింత ఆచారం
ప్రస్తుతం జరుగుతున్న ఉత్సవాల్లో ఓ వ్యక్తి దుర్యోధనుడికి 101 ఓల్డ్ మాంక్ రమ్ బాటిళ్లను నైవేద్యంగా సమర్పించడం సంచలనంగా మారింది. ఇలా భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని గుడి ఆవరణలోనే వేలం వేస్తారు.
దేవుడికి మొక్కు తీర్చుకునేందుకు అనేక మార్గాలుంటాయి. ప్రసాదం చేయిస్తారు. సేవా కార్యక్రమాలు చేస్తారు. తలనీలాలు సమర్పిస్తారు. నిలువుదోపిడీ ఇస్తారు. తన బరువుకు సమానమైన బెల్లం లేదా ఇతర వస్తువులు సమర్పిస్తారు. కానీ... కేరళలోని మలక్కుడ మహోత్సవంలో పూజలు అందుకునే దుర్యోధనుడికి భక్తితో మద్యాన్ని నైవేద్యంగా సమర్పించడం వింత ఆచారం. కేరళలోని కొల్లాం జిల్లా పొరువళిలో పెరువిరుతి మలనాడ ఆలయంలో వింత ఆచారం ఇది. ప్రస్తుతం అక్కడ మలక్కుడ మహోత్సవం జరుగుతోంది.
భారతదేశంలో దుర్యోధనుడికి రెండు ఆలయాలున్నాయి. ఒకటి ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలో ఉంది. రెండోది కేరళలో ఉంది. ఈ ఆలయంలో ప్రతీ ఏటా మార్చి నెలలో మలక్కుడ ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఉత్సవాల్లో చుట్టుపక్కల గ్రామస్తులంతా కలిసి సుమారు 100 అడుగుల వరకు గుమ్మటాలు తయారు చేసి ఊరేగిస్తారు. ఇక ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నైవేద్యం. ఇక్కడ దుర్యోధనుడికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇందుకు ఓ పౌరాణిక గాథ ఉంది. ఓసారి దుర్యోధనుడు పొరువళి నుంచి వెళ్తూ మలకంద్ గ్రామంలో ఆగాడు. గ్రామస్తులను తాగడానికి నీళ్లు అడిగాడు. కానీ ఓ వ్యక్తి నీళ్లకు బదులు కళ్లు ఇచ్చాడని, కల్లు తాగిన దుర్యోధనుడు సంతోషంతో తిరిగి వెళ్లాడని చరిత్ర చెబుతోంది. ఆ విధంగా దుర్యోధనుడికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వచ్చింది.
ప్రస్తుతం జరుగుతున్న ఉత్సవాల్లో ఓ వ్యక్తి దుర్యోధనుడికి 101 ఓల్డ్ మాంక్ రమ్ బాటిళ్లను నైవేద్యంగా సమర్పించడం సంచలనంగా మారింది. ఇలా భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని గుడి ఆవరణలోనే వేలం వేస్తారు. ఆ మద్యం బాటిళ్లను సొంతం చేసుకునేందుకు భక్తులు వేలంపాటలో ఉత్సాహంగా పాల్గొంటారు. మద్యంతో పాటు చికెన్ కూడా నైవేద్యంలో భాగంగా ఉంటుంది.
Holi 2019: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు... కలర్‌ఫుల్ ఫోటోలు చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.