Home /News /national /

10 YEARS OLD GIRL RAPED AND MURDER IN UP NAKED DEAD BODY RECOVERED FOR AN AGRICULTURE FIELD SK

Minor rape and murder: ఇంటి బయట ఆడుకుంటూ బాలిక అదృశ్యం.. పొలంలో నగ్నంగా మృతదేహం.. ఇంత ఘోరమా?

ఘటనా స్థలంలో పోలీసులు

ఘటనా స్థలంలో పోలీసులు

UP Rape and murder: చిన్నారి మృతదేహం ఒళ్లంతా గాయాలతో నగ్నంగా పడి ఉంది. ముఖంపై కిరోసిన్ పోసి తగులబెట్టారు. అక్కడి వాతావరణం చూస్తుంటే..ఆమెను అత్యాచారం చేసి.. చంపేసినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది.

  అభం శుభం తెలియని పదేళ్ల బాలిక. ఆరో తరగతి చదువుతోంది. ఇంటి మందు ఆడుకుంటూ అదృశ్యమైంది. రెండు రోజుల పాటు అంతటా వెతికారు. ఎక్కడా దొరకలేదు. చివరకు వేరే గ్రామంలోని ఓ పొలంలో శవమై తేలింది. ఆ చిన్నారి మృతదేహం ఒళ్లంతా గాయాలతో నగ్నంగా పడి ఉంది. ముఖంపై కిరోసిన్ పోసి తగులబెట్టారు. అక్కడి వాతావరణం చూస్తుంటే..ఆమెను అత్యాచారం చేసి.. చంపేసినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. ఎక్కడో చంపేసి.. ఆ తర్వాత పొలంలో విసిరేసి.. పారిపోయినట్లు తెలుస్తోంది. యూపీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలన రేపుతోంది.

  ఆడుకునే పిల్లలపై కాల్పులు జరుపుతాడా..ఆ మంత్రి కొడుక్కి ఎంత కండ కావరం

  కన్నౌజ్ జిల్లా గుర్సహైగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ మిస్సింగ్ కేసు నమోదయింది. 10 ఏళ్ల వయసున్న 6వ తరగతి అదృశ్యమయంది. గురువారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుందా పోయింది. ఆమె తండ్రి ఒక సాధారణ రైతు. కూతురి కోసం ఊరంతా వెతికారు. ఎక్కడా ఆమె ఆచూకీ కనిపించలేదు. తనకు తెలిసిన వారితో బయటకు వెళ్లిందేమో.. మళ్లీ ఇంటికి తిరిగి వస్తుందని భావించారు. కానీ చీకటి పడినా ఇంటికి రాలేదు. చూస్తుండగానే రెండు రోజులు గడిచిపోయాయి. పాప గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆమె తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలయింది. ఏదో జరగరానిదే జరిగిందని మనసులో కీడు శకించింది. చివరకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ కూతురు కనిపించడం లేదని.. మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసులు కూడా గాలించారు. తెలిసిన వారిని ఆరా తీశారు. ఐనా ఆమె గురించి తెలియలేదు.

  Cheating Woman: ఆమె ఓ ఖతర్నాక్ లేడీ.. ఒకేసారి ఇద్దరితో ఎఫైర్.. ఎవరితో

  కట్ చేస్తే.. శనివారం సాయంత్రం కమల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శృంగిరామ్‌పూర్ గ్రామంలోని ఓ పంట పొలంలో ఓ బాలిక మృతదేహం కనిపించింది. ఆమె శరీరంపై దుస్తులు లేవు. నగ్నంగా పడి ఉంది. ముఖంపై గాలిన గాయాలు ఉన్నాయి. బాలిక మృతదేహం ఉన్న పొలం ఓ రిటైర్డ్ టీచర్‌కు చెందినది. ఆ పొలాన్ని సతీష్ అనే రైతు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. సాయంత్రం మోటర్ వేసేందుకు పొలానికి వెళ్లగా.. అక్కడ బాలిక మృతదేహం కనిపించడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్పీ అశోక్‌కుమార్‌ మీనా, ఏఎస్పీ అజయ్‌ ప్రతాప్‌ దల్‌బాల్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. బాలిక మర్మాంగాల నుంచి రక్తం కారిన ఆనవాళ్లు కనిపించడంతో ఆమెపై అత్యాచారం జరిగిందని అనుమానించారు.

  వివాహితుడిని ప్రేమించిన 15 ఏళ్ల బాలిక.. పెద్దలు అంగీకరించకపోవడంతో చివరికి...

  ఆ తర్వాత మిస్సింగ్ కేసు పెట్టిన తల్లిదండ్రులను అక్కడికి పిలిపించారు. వారు మృతదేహాన్ని గుర్తించి..తమ కూతురే అని కన్నీరు పెట్టుకున్నారు. కన్న బిడ్డను ఆ పరిస్థితుల్లో చూసి గుండెలవిసేలా రోదించారు. పోలీసులు ఆమె డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. బాలిక మృతదేహం లభ్యమైన పొలానికి ఆమె ఊరు 9 కి.మీ. దూరంలో ఉంటుంది. గురువారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత.. ఓ వ్యక్తితో కలిసి బాలిక వెళ్లినట్లు కొందరు స్థానికులు చెప్పారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాలికను ఎక్కడో అత్యాచారం చేసి.. అనంతరం చంపేసి.. ఆ తర్వాత ఇక్కడి పడేశారని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని..త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Up news, Uttar pradesh

  తదుపరి వార్తలు