Home /News /national /

10 YEARS 65 NATIONS US COUPLE ARRIVE IN KERALA ON NEVER ENDING HONEYMOON TRIP GH SK

Never-Ending Honeymoon: పదేళ్లుగా హనీమూన్‌లోనే జంట.. ఇప్పటి వరకు 65 దేశాల్లో పర్యటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లి అయిన కొత్త జంట పర్యాటక ప్రాంతాలకు హనీమూన్‌(Honeymoon)కి వెళ్తారు. మహా అయితే కొన్ని వారాలపాటు నచ్చిన ప్రదేశాలను ఎంజాయ్‌ చేసి వస్తారు. కానీ ఓ జంట 10.5 సంవత్సరాలుగా హనీమూన్‌ ట్రిప్‌లో ఉందంటే నమ్ముతారా?

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
Never-Ending Honeymoon: పెళ్లి అయిన కొత్త జంట పర్యాటక ప్రాంతాలకు హనీమూన్‌(Honeymoon)కి వెళ్తారు. మహా అయితే కొన్ని వారాలపాటు నచ్చిన ప్రదేశాలను ఎంజాయ్‌ చేసి వస్తారు. కానీ ఓ జంట 10.5 సంవత్సరాలుగా హనీమూన్‌ ట్రిప్‌లో ఉందంటే నమ్ముతారా? అవును 2012లో పెళ్లి చేసుకున్న న్యూయార్క్‌కు చెందిన ఆనీ(Anne), మైక్ హోవార్డ్‌(Mike Howard)ల జంట ప్రపంచాన్ని చుట్టేస్తుంది. పెళ్లి జరిగినప్పటి నుంచి వీళ్లు వివిధ దేశాల్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ఇప్పటికి 64 దేశాలలో పర్యటించిన ఈ జంట ప్రస్తుతం ఇండియాలో ఎంజాయ్‌ చేస్తోంది. వారి లాంగెస్ట్‌ హనీమూన్‌ ట్రిప్‌ వివరాలు ఇవే..

* 2012 నుంచి హనీమూన్‌ ట్రిప్‌
ఆనీ, మైక్‌ హోవార్డ్‌ల జంట 2012లో వివాహం అయినప్పటి నుంచి హనీమూన్‌లో ఉంది. కచ్చితంగా చెప్పాలంటే 10.5 సంవత్సరాలలో 64 దేశాలను సందర్శించారు. ఆయా దేశాల ప్రత్యేకతలను ఆనందించారు. వారు ప్రయాణాన్ని ఇప్పట్లోనే ముగించే యోచనలో లేరు. ఒక వ్యక్తికి రోజుకు $34 (సుమారు రూ.2,700) బడ్జెట్‌ను నిర్ణయించుకుని ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఈ ప్రయాణం వారి జీవితంలో ఒక భాగమైపోయింది. వారి సందర్శించిన జాబితాలో ఐరోపా, ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలు ఉన్నాయి. వారి 65వ దేశమైన భారతదేశం పర్యటన కేరళ నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.

OMG: కొంప ముంచిన పెళ్లి పంచాయతీ.. మంచి మాటలు చెప్దామని వెళితే

* ఇండియా టూర్‌కు కేరళ గేట్‌వే
తమ పర్యటన గురించి మైక్‌(45) మాట్లాడుతూ..‘మేము భూటాన్ నుంచి ఇండియాకు వచ్చాం. న్యూజెర్సీలోని హోబోకెన్‌లో టూ-ఆన్-టూ-వాలీబాల్ ఆడుతున్నప్పుడు అన్నీ(40)ని కలిశాను. జంటగా భారత్‌కు రావడం ఇదే తొలిసారి. పర్యాటకులకు భారతదేశం గేట్‌వేగా కేరళ పనిచేస్తుంది. ఇది ఇతర ప్రదేశాల కంటే చాలా మధురంగా ​​ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతుల సమ్మేళనంగా కనిపిస్తుంది. కేరళలో లభించే కూరగాయలతో చేసిన వివిధ రకాల వంటకాలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. శాఖాహారులుగా, వంట కోసం వివిధ మార్గాల్లో ఉపయోగించే కూరగాయలను చూసి ఆశ్చర్యపోయాం.’ అని చెప్పాడు.

ట్యూషన్ టీచర్ పాడుపని.. బాలికను బలవంతంగా మందు తాగించి.. ఆ తర్వాత

15 సంవత్సరాల క్రితం కళాశాలలో ఉన్నప్పుడు పర్సనల్‌ ట్రిప్‌లో ఇండియాకు వచ్చినట్లు అన్నే పేర్కొంది. ఎవరైనా భారత్ పర్యటనకు వెళ్లాలంటే కేరళ నుంచే ప్రారంభించాలని దంపతులు ఇద్దరూ చెబుతున్నారు. ఈ జంట రెండున్నర వారాల పాటు కేరళలోనే ఉండనుంది. అన్నే రచించిన రెండు పుస్తకాలు.. కపుల్స్‌కు ట్రావెల్ గైడ్ అయిన ‘అల్టిమేట్ జర్నీస్ ఫర్ టూ’, ఉత్తర అమెరికాలో అత్యుత్తమ గ్లాంపింగ్ డెస్టినేషన్స్‌ గురించి రాసిన ‘కంఫర్టబుల్ వైల్డ్‌’ పుస్తకాలను సహ రచయితగా మైక్ అన్నారు.

* గోవా, ముంబై తరువాత క్రొయేషియా
ప్రయాణానికి సంబంధించి మేం ఎప్పుడూ ఏదీ ప్లాన్ చేసుకోమని, ప్రయాణ ప్రణాళికను ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతామని, సుదీర్ఘ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ వైఖరి ఉపయోగపడుతుందని అన్నే చెప్పారు. ట్రావెల్‌ చేసే వారికి రెండు వారాల ట్రిప్పులు బెస్ట్‌ అని చెప్పారు. స్థానిక, తక్కువ ధరకు లభించే ఆహారం, వసతి ఎంపికల పరంగా మైక్ తమను తాము 'బడ్జెట్ ట్రావెలర్స్'గా పేర్కొంటున్నారు.
లోకల్‌ బస్‌లలోనే ప్రయాణిస్తామని, స్థానిక తినుబండారాలను తింటామని, స్థానిక ప్రజలతో మాట్లాడటం ఎంజాయ్‌ చేస్తామని అన్నే తెలిపారు. ఇది తమ ఖర్చులను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా, ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుందని వివరించారు. ఒక స్థలం గురించి సోషల్ మీడియా చెప్పే వాటిని నమ్మే బదులు, గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోవడానికి ఇది గొప్ప మార్గం అని పేర్కొన్నారు.సోషల్ మీడియాలో అందరూ వ్యతిరేకించిన టూరిస్ట్‌ ప్లేస్‌లకు తాము వెళ్లామని, కానీ వాస్తవానికి చాలా భిన్నంగా ఉన్నాయని మైక్‌ చెబుతున్నారు. పుస్తకాలు, జంట బ్లాగ్ 'హనీట్రెక్' తమ ప్రదాన ఆదాయ వనరులను ఆ జంట చెబుతోంది. గోవా, ముంబై తర్వాత తమ 66వ దేశమైన క్రొయేషియాకు వెళ్లనున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: America, Kerala, Life Style, Lifestyle

తదుపరి వార్తలు