• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • 10 YEAR OLD BOY FROM GUJARAT VISITED CORONA TESTING CENTRE TO CREATE AWARENESS AK

Gandhi Jayanti 2020: కరోనా పరీక్ష కేంద్రానికి వెళ్లిన చిన్నారి గాంధీ.. ఎందుకంటే..

గాంధీ వేషధారణలో వెళ్లి కరోనా పరీక్ష చేయించుకున్న బాలుడు

Gandhi Jayanti 2020: తాను కేవలం కరోనా పరీక్ష యొక్క ప్రాధాన్యత గురించి చెప్పేందుకు ఇలా చేశానని అన్నాడు. ఇందులో మరో ఉద్దేశ్యం లేదని ఆ బాలుడు వివరించాడు.

  • Share this:
    దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ కేసులను వెలుగులోకి తీసుకొచ్చే కరోనా పరీక్షలు సంఖ్య కూడా కోట్లలోనే ఉంది. అయితే ఇప్పటికీ దేశంలో కరోనా పరీక్షలు చేయించుకోవడానికి చాలామంది ముందుకు రావడం లేదనే అభిప్రాయం ఉంది. కరోనా లక్షణాలు ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని.. వైరస్‌ను తొందరగా గుర్తించడం వల్ల దాని నుంచి పొంచి ఉన్న ముప్పు తప్పుతుందని చాలామంది వైద్యులు, నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని గుజరాత్‌కు చెందిన పదేళ్ల బాలుడు తనదైన శైలిలో సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేశాడు.

    గాంధీ వేషధారణలో వెళ్లి కరోనా పరీక్ష చేయించుకున్న బాలుడు


    గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన పదేళ్ల బాలుడు కరోనా పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. మామూలుగా వెళితే అందులో విశేషమేమీ లేదు. అయితే గాంధీ వేషధారణలో ఆ బాలుడు కరోనా పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. రేపు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ వేషం వేసుకున్న ఆ బాలుడు.. కరోనా పరీక్ష కేంద్రానికి వెళ్లి టెస్టు కోసం శాంపిల్స్ ఇచ్చాడు. తెల్లని దోవతీ, చేతి కర్ర, కళ్ల జోడుతో గాంధీ తరహాలో వేషం వేసుకున్న ఆ బాలుడు తాను ఎందుకు ఈ ఇలా చేశాననే దానిపై వివరణ ఇచ్చాడు.

    గాంధీ వేషధారణలో వెళ్లి కరోనా పరీక్ష చేయించుకున్న బాలుడు


    తాను కేవలం కరోనా పరీక్ష యొక్క ప్రాధాన్యత గురించి చెప్పేందుకు ఇలా చేశానని అన్నాడు. ఇందులో మరో ఉద్దేశ్యం లేదని వివరించాడు. కరోనా పరీక్షల కోసం తాను శాంపిల్స్ ఇచ్చానని.. ప్రజలు కరోనా పరీక్షలు చేసుకునేందుకు వెనకాడవద్దని సూచించాడు. ప్రజలు సహకరిస్తేనే దేశం ఆరోగ్యవంతంగా ఉంటుందని తెలిపాడు. గుజరాత్‌తో గత 24 గంటల్లో 1390 కరోనా కేసులు నమోదవ్వగా.. 1372 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ వైరస్ కారణంగా 11 మంది చనిపోయాడు.
    Published by:Kishore Akkaladevi
    First published: