Home /News /national /

10 MLAS OF SIKKIM DEMOCRATIC FRONT JOIN BJP IN DELHI SK

మాజీ సీఎంకు బిగ్ షాక్...బీజేపీ గూటికి 10 మంది ఎమ్మెల్యేలు

బీజేపీలో చేరిన ఎస్డీఎఫ్ ఎమ్మెల్యేలు

బీజేపీలో చేరిన ఎస్డీఎఫ్ ఎమ్మెల్యేలు

పవన్ చామ్లింగ్ సిక్కింకు 25 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నారు. అలాంటి సీనియర్ నేతకు సొంత పార్టీ ఎమ్మెల్యేలుే ఊహించని షాకిచ్చారు.

    సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్‌కు బిగ్ షాక్ తగిలింది. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (SDF)కి 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారంతా ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. 32 అసెంబ్లీ సీట్లున్న సిక్కి అసెంబ్లీకి 2019లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో సిక్కిం డమోక్రటిక్ ఫ్రంట్ 15 సీట్లు గెలవగా, సిక్కిం క్రాంతి మోర్చా 17 స్థానాల్లో గెలిచి అధికారాన్ని చేపట్టింది.

    ఒక రాష్ట్రానికి అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు పవన్ చామ్లింగ్ పేరిట ఉంది. సిక్కింకు 25 ఏళ్ల పాటు ఆయన సీఎంగా ఉన్నారు. అలాంటి సీనియర్ నేతకు సొంత పార్టీ ఎమ్మెల్యేలుే ఊహించని షాకిచ్చారు. ఉన్న 15 ఎమ్మెల్యేల్లో 10 మంది బీజేపీలో చేరడం ఆ పార్టీ అధినేత పవన్ చామ్లింగ్‌కు పెద్ద ఎదురు దెబ్బే. సిక్కిం అసెంబ్లీలో విపక్ష SDF బలం 5కు పడిపోయింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, Sikkim

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు