భారత రైల్వే చరిత్రలో మరో పెను ప్రమాదం తృటిలో తప్పినట్లయింది. ఎల్టీటీ-జయ్నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి, 10 బోగీలు నేలపైకొచ్చేశాయి. అదృష్టవశాత్తూ బోగీలు ఒకదానికొకటి ఢీకొనకొనడం లేదా కింద పడిపోవడం జరగలేదు. దీంతో భారీ ప్రాణ నష్టం తప్పినట్లయింది. ఎల్టీటీ-జయ్నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని ఆదివారం మధ్యాహ్నం పట్టాలు తప్పింది. సమాచారం తెలిసిన వెంటనే రైల్వే సిబ్బంది హుటాహుటిన సహాయక బలగాలను ఘటనాస్థలికి పంపింది. ఈ ప్రమాదంలో మరణాలు, క్షతగాతృల వివరాలు తెలియాల్సి ఉంది.
ఎల్టీటీ-జయ్నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు నాసిక్ సమీపంలోని లహవిత్ – దేవ్లాలి మధ్య పట్టాలు తప్పిందని, మధ్యాహ్నం 3.10 గంటలకు ఈ ఘటన జరిగిందని, యాక్సిడెంట్ రిలీఫ్ రైలు, మెడికల్ వ్యాన్ సంఘటనా స్థలానికి వెళ్లాయని, ప్రయాణికులను సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సెంట్రల్ రైల్వే సీపీఆర్ఓ ఒక ప్రకటనతో తెలిపారు.
రైలులోని 10 బోగీలు పక్కకు నేలపైకి రావడంతో ప్రయాణికులు భయాందోళనకుగురయ్యారు. హుటాహుటిన అందరూ కిందికి దిగేశారు. కాగా, ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నా, అధికారులు నిర్ధారించలేదు. జయనగర్ రైలు పట్టాలు తప్పడంతో.. ఆ మార్గంలో ప్రయాణించే ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Visuals of derailed coaches of 11061 LTT-Jaynagar Express between Lahavit and Devlali (near Nashik) on Dn line at around 15.10 hrs today Accident relief train and medical van rushed to the spot. Details awaited: Central railway CPRO pic.twitter.com/nXA0hvTw0I
— ANI (@ANI) April 3, 2022
ఎల్టీటీ-జయ్నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై సమాచారం కోసం CSMT స్టేషన్ TC కార్యాలయంలో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్టుగా రైల్వే శాఖ తెలిపింది. రైల్వే : 55993, MTNL: 02222694040, హెల్ప్‌లైన్ నెం- 022 67455993 కు ఫోన్ చేయవచ్చని పేర్కొంది. భుసావల్ డివిజన్లో రైలు పట్టాలు తప్పడంతో.. కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా, మరికొన్ని రైళ్లను రూట్ మళ్లించినట్టుగా రైల్వే శాఖ వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, Maharashtra, Train