గన్ లైసెన్స్ కావాలా..? అయితే ఆవులకు 10 బ్లాంకెట్స్ దానం చేయండి..

'మీకు గన్ లైసెన్స్ కావాలా..? అయితే ముందు గోవుల కోసం 10 బ్లాంకెట్స్‌ను దానం చేయండి.' మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా కలెక్టర్ అనురాగ్ చౌదరి ఈ ప్రకటన చేశారు.

news18-telugu
Updated: December 15, 2019, 6:35 PM IST
గన్ లైసెన్స్ కావాలా..? అయితే ఆవులకు 10 బ్లాంకెట్స్ దానం చేయండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
'మీకు గన్ లైసెన్స్ కావాలా..? అయితే ముందు గోవుల కోసం 10 బ్లాంకెట్స్‌ను దానం చేయండి.' మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా కలెక్టర్ అనురాగ్ చౌదరి ఈ ప్రకటన చేశారు. శనివారం గోలా కా మందిర్ ప్రాంతంలోని ఓ గోశాలను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇటీవలే ఇక్కడి గోశాలలోని ఆరు ఆవులు చలికి తట్టుకోలేక చనిపోయాయి. ఈ నేపథ్యంలో గోవులకు బ్లాంకెట్స్ దానం చేసేవారికి గన్ లైసెన్స్ ఇస్తామని కలెక్టర్ ప్రకటించారు. గ్వాలియర్ మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో లాల్ తిపారా ప్రాంతంలో నిర్వహిస్తున్న గోశాలను కూడా ఆయన సందర్శించారు. గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారు.. మొదట ఈ రెండు గోశాలల్లోని ఆవులకు 10 బ్లాంకెట్స్ దానం చేయాలని సూచించారు. ఆవులను చలి నుంచి కాపాడటం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

కలెక్టర్ అనురాగ్ చౌదరి ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేశారు. గన్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునేవారు మొదట కొన్ని మొక్కలు నాటాలని ఆదేశించారు. గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసే సమయంలో ఆ మొక్కలతో దిగిన సెల్ఫీని కూడా సమర్పించాలని ఆదేశించారు.

First published: December 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>