ఏపీ తర్వాత బీహార్‌పై దృష్టిపెట్టిన నరేంద్ర మోదీ... నితీశ్‌ కుమార్‌తో పొత్తు కలిసొస్తుందా?

Lok Sabha Elections 2019 : పైకి మిత్రత్వం ఉన్నా... తెరవెనక ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు బీజేపీ, జేడీయూ నేతలు. మరి ఈ పొత్తు ఎంతవరకూ ప్రయోజనం?

Krishna Kumar N | news18-telugu
Updated: April 2, 2019, 11:28 AM IST
ఏపీ తర్వాత బీహార్‌పై దృష్టిపెట్టిన నరేంద్ర మోదీ... నితీశ్‌ కుమార్‌తో పొత్తు కలిసొస్తుందా?
మోదీ, నితీశ్ కుమార్ (File photo/PTI)
  • Share this:
బీహార్‌లో మైకులు మారుమోగుతున్నాయి. అక్కడ కూడా మన తెలుగు రాష్ట్రాలలో లాగే... లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. కాకపోతే వివిధ దశల్లో జరుగుతాయి. అందుకోసం అధికార జేడీయూతో పొత్తు పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ... ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం వీళ్లిద్దరూ కలిసి... గయలో జరిగే ర్యాలీలో పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం జమూయ్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న మోదీ... సాయంత్రం నితీశ్‌ని కలవనున్నారు. సాయంత్రం ర్యాలీలో కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కూడా పాల్గొనబోతున్నారు.

జమూయ్, గయ... ఈ రెండు లోక్ సభ స్థానాల్లోనూ బీజేపీ పోటీ చెయ్యట్లేదు. గయలో పోటీ మాంఝీ వర్సెస్ మాంఝీగా సాగుతోంది. మహాఘట్‌బంధన్ తరపున మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ పోటీ చేస్తుంటే... NDA తరపున మాజీ ఎంపీ భగవతి దేవి కొడుకు విజయ్ కుమార్ మాంఝీ బరిలో దిగారు. 2014లో గయ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. ఈసారి జేడీయూకి మద్దతివ్వడం వల్ల ఈ స్థానానికి జేడీయూ అభ్యర్థి బరిలో దికారు.

బీహార్‌లోని 40 లోక్ సభ స్థానాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవాలనుకుంటున్న బీజేపీ కూటమి... ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షాతోపాటూ... ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సహా... 12 మంది కేంద్ర మంత్రుల్ని ప్రచార రంగంలోకి దింపుతోంది.


ఈసారి బీహార్‌లో లోటు ఏంటంటే... ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కనిపించకపోవడమే. ప్రస్తుతం ఆయన రాంజీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. లాలూ పశువుల దాణా కుంభకోణంలో దోషిగా తేలారు. తండ్రి బదులు ఇప్పుడు ఆయన కొడుకు తేజశ్విని యాదవ్... ప్రతిపక్ష కూటమికి ప్రధాన కేంద్ర బిందువుగా మారారు. బీహార్ అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నేత కూడా. గత వారం వరకూ ఆయన రోజుకు 3-5 ర్యాలీలు నిర్వహించారు.

మహాఘట్‌బంధన్‌లో మిత్రపక్షమైన కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ త్వరలో ర్యాలీలు చేపట్టే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆయన పూర్ణియాలో ఓ ర్యాలీ చేశారు.

సీట్ల సర్దుబాటు విషయానికొస్తే... RJD 20 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో బరిలో దిగుతోంది. చిన్న పార్టీ అయిన ఉపేంద్ర కుష్వాహా నిర్వహిస్తున్న రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (RLSP) 5 చోట్ల పోటీ చేస్తోంది. హిందుస్థాన్ అవామ్ మోర్చా (HAM) 3 చోట్లా... వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ (VIP) 3 చోట్లా బరిలో దిగాయి.

NDA నుంచీ చూస్తే... జేడీయూ 17 చోట్ల, బీజేపీ 17 చోట్లా పోటీ చేస్తున్నాయి. మిగతా 6 స్థానాల్లో లోక్ జనతాంత్రిక్ పార్టీ అభ్యర్థుల్ని బరిలో దింపుతోంది. 

ఇవి కూడా చదవండి :

మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ మొత్తం ఆస్తుల చిట్టా ఇదీ... ఐదేళ్లలో ఎంత పెరిగాయంటే...

భారత్ మిషన్ శక్తి ప్రయోగం ప్రమాదకరం... స్పేస్ వ్యర్థాలతో వ్యోమగాములకు ఇబ్బందే... నాసా ప్రకటన

హ్యాట్రిక్ కొట్టిన టీంఇండియా... టెస్టుల్లో మళ్లీ ఛాంపియన్లుగా కోహ్లీ సేన

టాస్ బదులు ట్విట్టర్ పోల్... ఫోర్ కొడితే 8, సిక్స్ కొడితే 12... ఇది ఏప్రిల్ ఫూల్ కాదు... ఐసీసీ నిర్ణయాలు
First published: April 2, 2019, 11:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading