నేపాల్ పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి.. సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత

భారత్‌తో నేపాల్ 1,850 కి.మీ. సరిహద్దును పంచుకుంటోంది. ఇది ఓపెన్ బార్డర్. ఇక్కడి వారు అక్కడికి.. అక్కడి వారు ఇక్కడికి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఐతే ఇటీవల భారత్ పట్ల నేపాల్ వైఖరి మారింది. చైనా అండను చూసుకొని చెలరేగిపోతోంది.

news18-telugu
Updated: June 12, 2020, 3:17 PM IST
నేపాల్ పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి.. సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత
భారత్‌తో నేపాల్ 1,850 కి.మీ. సరిహద్దును పంచుకుంటోంది. ఇది ఓపెన్ బార్డర్. ఇక్కడి వారు అక్కడికి.. అక్కడి వారు ఇక్కడికి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఐతే ఇటీవల భారత్ పట్ల నేపాల్ వైఖరి మారింది. చైనా అండను చూసుకొని చెలరేగిపోతోంది.
  • Share this:
సరిహద్దుల్లో నేపాల్ పోలీసులు రెచ్చిపోయారు. భారతీయులే టార్గెట్‌గా కాల్పులు జరిగారు. నేపాల్ పోలీసుల కాల్పుల్లో ఒక భారతీయు పౌరుడు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బీహార్‌లోని పిప్రా పర్సేన్ గ్రామంలో ఉన్న లాల్‌బందీ-జానకినగర్ సరిహద్దు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సహస్త్ర సీమ బల్ (ssb) అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. కొందరు భారతీయులు నేపాల్‌లోకి వెళ్తుండగా అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దదవడంతో నేపాల్ పోలీసులు తుపాకులతో కాల్పులతో జరిపారు.

కాల్పుల్లో వికేష్ కుమార్ అనే 25 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. సమీప పొలాల్లో పనిచేసుకుంటున్న ఉమేష్ రామ్, ఉదయ్ థాకూర్‌తో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. లగాన్ రాయ్ అనే మరో వ్యక్తిని నేపాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐతే తమ పొలం నేపాల్ భూభాగంలో ఉంటుందని.. అక్కడ పని చేసుకుంటున్న సమయంలో పోలీసులు వచ్చి ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించినట్లు మృతుడి తండ్రి చెప్పారు. ఇది తమ పొలమని చెప్పినా వినకుండా.. వెళ్లిపోవాలంటూ బెదిరించారని వాపోయారు. తమ కుమారుడు నిలదీయడంతో వారు కాల్పులు జరిపారని కన్నీళ్లు పెట్టుకున్నారు.


మే 17న కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తమ సరిహద్దులోకి వచ్చారంటూ నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో పలువురు గాయపడ్డారు. కాగా, భారత్‌తో నేపాల్ 1,850 కి.మీ. సరిహద్దును పంచుకుంటోంది. ఇది ఓపెన్ బార్డర్. ఇక్కడి వారు అక్కడికి.. అక్కడి వారు ఇక్కడికి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఐతే ఇటీవల భారత్ పట్ల నేపాల్ వైఖరి మారింది. చైనా అండను చూసుకొని చెలరేగిపోతోంది. భారత్‌లోని లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురా తమ భూభాగాలే అంటూ ఇటీవల కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది నేపాల్. అంతేకాదు భారత్ వల్లే తమ దేశంలో కరోనా వ్యాపిస్తోందని నిందలు వేస్తోంది.
First published: June 12, 2020, 3:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading