హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

covaxin vs covishield : టీకా తీసుకున్నా..కరోనా భారిన పడుతున్న వారి సంఖ్య ఎంతో తెలుసా...

covaxin vs covishield : టీకా తీసుకున్నా..కరోనా భారిన పడుతున్న వారి సంఖ్య ఎంతో తెలుసా...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

covaxin result : టీకా తీసుకున్న తర్వాత కూడ ఎంతమంది కరోనా భారిన పడుతున్నారనే అంశాలపై ఐసిఎంఆర్ ఓ అధ్యయనాన్ని విడుదల చేసింది. ప్రతివేల మందిలో నలుగురు టీకా తీసుకున్న తర్వాత తిరిగి కరోనా భారిన పడుతున్నట్టు వెల్లడించింది.

కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత కూడ కరోనా భారిన పడుతున్నారనే వార్తలపై ప్రజలు అందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే..దీంతో టీకా తీసుకున్నా ప్రయోజనం లేదనే నిర్ణయానికి ప్రజలు వస్తున్నారు. అయితే ఇలాంటీ వార్తలు నిజం కాదని ఐసిఎంర్ కొట్టిపారేసింది. టీకా తీసుకున్న తర్వాత ఎంతమంది తిరిగి కరోనా భారిన పడుతున్నారనే అధ్యయనాలను తాజాగా విడుదల చేసింది.ఈ నేపథ్యంలోనే కొవాగ్జిన్ రెండు డోసులూ తీసుకున్న వారిలో 0.04 శాతం మంది కరోనా బారిన పడ్డట్టు తాజాగా వెల్లడైంది. ఇక కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వారిలో 0.03 శాతం మంది కరోనా బారినపడ్డట్టు తెలిసింది. ఈ సమాచారాన్ని భారత వైద్య ఆరోగ్య పరిశోధన మండలి పేర్కొంది

దీంతో కొవిడ్ టీకా తీసుకున్నాక ప్రతి 10 వేల మందిలో అత్యధికంగా నలుగురు మాత్రమే కరోనా బారినపడ్డారనే సమాచారాన్ని ఐసీఎమ్ఆర్ చీఫ్ భార్గవ పేర్కొన్నారు. దీంతో టీకా తీసుకుని కరోనా కాటుకు గురైన వారిలో వ్యాధి తీవ్రత కూడ చాలా తక్కువగా ఉందని కూడా పేర్కొన్నారు. కాగా కరోనా అడ్డుకునే సామర్ధ్యం కేవలం 70 శాతం ఉందనే అంశాన్ని గతంలోనే వెలువరించారు. అయితే అంచనాలకంటే ఎక్కువగానే టీకా పనిచేస్తుందని పలు అధ్యయనాల్లో వెలువడుతోంది. ఇక రెండు తీసుకున్న 15 రోజుల తర్వాతే శరీరంలో తగినంత స్తాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని మొదటి అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

First published:

Tags: Covaxin, Covishield

ఉత్తమ కథలు