Zombie Reddy : జాంబిరెడ్డి సినిమా రెండోసారి రికార్డు టీఆర్‌పీ రేటింగ్.. స్టార్ హీరో మూవీ రేంజ్‌లో అదరగొట్టిందిగా..

రెండోసారి రికార్డు టీఆర్పీతో అదరగొట్టిన జాంబీ రెడ్డి మూవీ (Zombie Reddy Photo: Twitter)

Zombie Reddy : యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా ‘జాంబి రెడ్డి’. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో కనిపించి అలరించిన నటుడు తేజ సజ్జహీరోగా వచ్చిన ఈ సినిమా ఈ మధ్య విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా రెండోసారి టీవీలో ప్రసారమైన ఈ చిత్రం రికార్డు టీఆర్పీ సాధించింది.

  • Share this:
    Zombie Reddy : యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా ‘జాంబి రెడ్డి’. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో కనిపించి అలరించిన నటుడు తేజ సజ్జహీరోగా వచ్చిన ఈ సినిమా ఈ మధ్య విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కరోనాను బ్యాగ్ గ్రౌండ్‌లో తీసుకుని జాంబి రెడ్డి సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం కూడా జోడించిడంతో సినిమాలో నవ్వులు పువ్వులు పూసాయి. కామెడీ ఓ రేంజ్‌లో పేలింది. ఈ సినిమా థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన అందులోనే కామెడీ కూడా వర్కవుట్ చేయడంతో జనాలను బాగానే ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. రూ. 4 కోట్ల బడ్జెట్‌తో రూపోందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.  15 కోట్ల వరకు వసూలు చేసిందని టాక్. చిన్న సినిమాగా వచ్చిన టాక్ బాగుండడంతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపింది. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి నందినీ, ఢిల్లీ బ్యూటీ దక్షనగర్కర్ హీరోయిన్స్‌గా నటించారు. గెటప్ శీను, హేమంత్, అన్నపూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్’ తెరకెక్కించబోతున్నట్టు దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు.

    అది అలా ఉంటే ఈ సినిమా 'జాంబి జోనర్‌లో వచ్చిన తొలి తెలుగు సినిమా. ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా కొనుగోలు చేసంది. కాగా ఈ సినిమా మొదటిసారి స్టార్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ప్రసారం చేస్తే ఏకంగా 9.7 టీఆర్పీ వచ్చింది. ఓ కొత్త హీరోకు ఈ రేంజ్ రేటింగ్ అంటే పెద్ద విశేషమే అంటున్నారు.

    రెండోసారి రికార్డు టీఆర్పీతో అదరగొట్టిన ‘జాంబీ రెడ్డి’ మూవీ (Twitter/Photo)


    తాజాగా ఈ సినిమాను రెండో సారి కూడా టెలివిజన్‌లో టెలికాస్ట్ చేస్తే.. అపుడు కూడా 8.1 టీర్పీ సాధించింది. ఒక యంగ్ హీరో నటించిన సినిమాకు రెండో సారి కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం కూడా ఓ రికార్డే అని చెబుతున్నారు. మొత్తంగా వెండితెరపై ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా టీవీ తెరపై కూడా అదే రేంజ్‌లో రెస్పాన్స్ తెచ్చుకోవడం మాములు విషయం కాదంటున్నారు.


    ‘జాంబీ రెడ్డి’ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ విషయానికి వస్తే.. మొదటి సినిమా 'అ!' తోనే జాతీయ అవార్డు పొందిన టాలెంట్ ఉన్న యువ దర్శకుడు. ఆ సినిమాను నాని సమర్పణలో తెరకెక్కింది.  కాజల్, నిత్యా మీనన్, రెజీనా, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటించారు. ఇక ఆ సినిమా ఇచ్చిన పాపులారిటీతో ప్రశాంత్ వర్మ ఆ తర్వాత సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా వచ్చిన కల్కి సినిమాకు దర్శకత్వం వహించారు. మంచి అంచనాల నడుమ విడుదలై ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా ఆకట్టుకోలేక పోయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకుని కొత్త కాన్సెప్ట్‌తో పక్కాగా వచ్చిన ప్రశాంత్ వర్మ తన మూడో సినిమాను జాంబిల నేపథ్యంలో ఓ కొత్త కాన్సెప్ట్‌తో రూపోందించారు. ఇక భారీ చిత్రాలకు మాత్రమే గతంలో ఈ తరహా రేటింగ్ వచ్చేదని. కానీ, ఇప్పుడు చిన్న చిత్రం 'జాంబి రెడ్డి'కి ఈ రేంజ్‌లో  రేటింగ్ అది కూడా రెండోసారి కూడా రావడం చిత్ర యూనిట్‌లో జోష్‌ను నింపేసిందని అంటున్నారు. అంతేకాదు త్వరలో ఈసినిమా సీక్వెల్‌కు సంబంధించిన ప్రకటన వెలుబడనుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: