#ZeroToday: హిట్ కొడితే హీరో.. లేదంటే నిజంగానే జీరో..

పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు. ఇప్పుడు షారుక్ ఖాన్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. షారుక్ పేరుకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ రికార్డులు తిర‌గ‌రాయ‌డానికి ఈ ఒక్క పేరు చాలు. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీ రికార్డుల‌తో చెడుగుడు ఆడుకున్న కింగ్ ఖాన్.. ఇప్పుడు ఉనికి కోసం పాటు ప‌డుతున్నాడు. ఈయ‌న సినిమాలు కొన్నేళ్లుగా స‌రిగ్గా ఆడ‌టం లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 20, 2018, 10:44 PM IST
#ZeroToday: హిట్ కొడితే హీరో.. లేదంటే నిజంగానే జీరో..
షారుఖ్ జీరో మూవీ
  • Share this:
పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు. ఇప్పుడు షారుక్ ఖాన్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. షారుక్ పేరుకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ రికార్డులు తిర‌గ‌రాయ‌డానికి ఈ ఒక్క పేరు చాలు. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీ రికార్డుల‌తో చెడుగుడు ఆడుకున్న కింగ్ ఖాన్.. ఇప్పుడు ఉనికి కోసం పాటు ప‌డుతున్నాడు. ఈయ‌న సినిమాలు కొన్నేళ్లుగా స‌రిగ్గా ఆడ‌టం లేదు. క‌నీసం 100 కోట్లు వ‌సూలు చేయ‌డానికి కూడా ఇబ్బంది ప‌డే స్థాయికి వ‌చ్చేసాయి. 5 ఏళ్ల కింద "చెన్నై ఎక్స్‌ప్రెస్" సినిమాతో బాలీవుడ్‌లో తొలిసారి 400 కోట్ల మార్క్ అందుకున్న షారుక్.. ఆ త‌ర్వాత స్థాయికి త‌గ్గ విజ‌యం కోసం తంటాలు ప‌డుతూనే ఉన్నాడు.
 #ZeroToday: Shah Rukh Khan All hopes on Zero Movie.. పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు. ఇప్పుడు షారుక్ ఖాన్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. షారుక్ పేరుకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ రికార్డులు తిర‌గ‌రాయ‌డానికి ఈ ఒక్క పేరు చాలు. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీ రికార్డుల‌తో చెడుగుడు ఆడుకున్న కింగ్ ఖాన్.. ఇప్పుడు ఉనికి కోసం పాటు ప‌డుతున్నాడు. ఈయ‌న సినిమాలు కొన్నేళ్లుగా స‌రిగ్గా ఆడ‌టం లేదు. zero movie,zero movie review,zero movie trailer released,Shah Rukh Khan zero trailer,anand l rai,srk zero,katrina kaif,anushka sharma,షారుక్ ఖాన్,జీరో ట్రైలర్ విడుదల,ఆనంద్ ఎల్ రాయ్,మరుగుజ్జుగా షారుక్,కత్రినా కైఫ్, అనుష్క శర్మ
షారుక్ ఖాన్ ఫైల్ ఫోటో


"హ్యాపీ న్యూ ఇయ‌ర్".. "ఫ్యాన్".. "ర‌యీస్".. "దిల్ వాలే".. "డియ‌ర్ జింద‌గీ".. "జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్".. ఇలా చేసిన సినిమాల‌న్నీ ఒక్క‌టి కూడా విజ‌యం సాధించ‌లేదు. అందుకే కొత్త క‌థ‌తో వ‌స్తున్నాడు షారుక్ ఖాన్. అంత‌టి ఇమేజ్ ఉన్న హీరోలెవ‌రూ క‌నీసం ఊహించ‌లేని విధంగా మ‌రుగుజ్జు పాత్ర‌లో న‌టించాడు కింగ్ ఖాన్. ఇప్పుడు ఈయ‌న నటించిన "జీరో" డిసెంబర్ 21న విడుదల అవుతుంది. ఈ సినిమా ట్రైలర్.. విజువల్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. కానీ అంచనాలు మాత్రం ఇదవరకులా లేవు. "త‌ను వెడ్స్ మ‌నూ" లాంటి సూప‌ర్ హిట్ సిరీస్ చేసిన ఆనంద్ ఎల్ రాయ్ దీనికి ద‌ర్శ‌కుడు.
 #ZeroToday: Shah Rukh Khan All hopes on Zero Movie.. పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు. ఇప్పుడు షారుక్ ఖాన్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. షారుక్ పేరుకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ రికార్డులు తిర‌గ‌రాయ‌డానికి ఈ ఒక్క పేరు చాలు. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీ రికార్డుల‌తో చెడుగుడు ఆడుకున్న కింగ్ ఖాన్.. ఇప్పుడు ఉనికి కోసం పాటు ప‌డుతున్నాడు. ఈయ‌న సినిమాలు కొన్నేళ్లుగా స‌రిగ్గా ఆడ‌టం లేదు. zero movie,zero movie review,zero movie trailer released,Shah Rukh Khan zero trailer,anand l rai,srk zero,katrina kaif,anushka sharma,షారుక్ ఖాన్,జీరో ట్రైలర్ విడుదల,ఆనంద్ ఎల్ రాయ్,మరుగుజ్జుగా షారుక్,కత్రినా కైఫ్, అనుష్క శర్మ
జీరో మూవీలో అనుష్క శర్మతో షారుఖ్

ఇందులో మ‌రుగుజ్జు పాత్ర‌లో షారుక్.. దివ్యాంగురాలి పాత్ర‌లో అనుష్క శ‌ర్మ నటించారు. ఇక హీరోయిన్ పాత్ర‌లో క‌త్రినా కైఫ్ నటించింది. ఈ ముగ్గురు మ‌ధ్య జ‌రిగే క‌థే "జీరో". మ‌రుగుజ్జుగా ఉండి స‌మాజంలో ప‌డే బాధ‌లు.. ఇబ్బందుల‌ను ఈ చిత్రంలో చ‌క్క‌గా చూపించాడు ద‌ర్శ‌కుడు ఆనంద్ ఎల్ రాయ్. ఇక ఈ పాత్ర‌ను ప్రాణంగా అందిపుచుకున్నాడు కింగ్ ఖాన్. క‌చ్చితంగా ఈ చిత్రంతో బ్లాక్‌బ‌స్టర్ కొట్టి తానేంటో నిరూపించుకోవాల‌ని చూస్తున్నాడు షారుక్. ట్రైల‌ర్ అంతా కామెడీతో పాటు ఎమోష‌న‌ల్ గానూ సాగింది. మ‌రి ఈ "జీరో"తో షారుక్ హీరో అనిపించుకుంటాడో లేదంటే మ‌రింత దిగ‌జారి జీరోగానే ఉండిపోతాడో చూడాలిక‌.
Published by: Praveen Kumar Vadla
First published: December 20, 2018, 10:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading