‘జీరో’ ఫస్ట్ సాంగ్... ప్రేమ రంగులు చూపిస్తున్న అనుష్క, షారుక్

‘జీరో’ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్... ‘మేరే నామ్ తూ...’ పాటకు ఒక్క రోజులోనే 8 మిలియన్ల వ్యూస్... అద్భుత అభినయంతో ఫిదా చేస్తున్న అనుష్క శర్మ, షారుక్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 23, 2018, 10:35 PM IST
‘జీరో’ ఫస్ట్ సాంగ్... ప్రేమ రంగులు చూపిస్తున్న అనుష్క, షారుక్
‘జీరో’ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్... ‘మేరే నామ్ తూ...’ పాటకు ఒక్క రోజులోనే 8 మిలియన్ల వ్యూస్... అద్భుత అభినయంతో ఫిదా చేస్తున్న అనుష్క శర్మ, షారుక్...
  • Share this:
బాలీవుడ్ బాద్‌షా... ‘కింగ్ ఖాన్’ షారుక్ బాక్సాఫీస్ దగ్గర తనదైన హిట్టు కొట్టి చాలాకాలమే అయ్యింది. ఐదేళ్ల క్రితం వచ్చిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ తర్వాత వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు షారుక్. గత ఏడాది వచ్చిన ‘రాయిస్’ కూడా షారుక్ ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. దాంతో కమ్‌బ్యాక్ కోసం ‘జీరో’పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. కత్రీనా కైఫ్, అనుష్క శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 21న విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ‘తను వెడ్స్ మనూ’, ‘రంజానా’, ‘తను వెడ్స్ మనూ రిటర్న్స్’ వంటి మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను రూపొందించిన ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జీరో’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.

షారుక్ దాదాపు ప్రయోగాలకు దూరంగా ఉంటాడు. మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రయోగాలతో హిట్లు కొడుతుంటే షారుక్ మాత్రం పాత మూస కథలనే ఎంచుకుంటూ వరుసగా ఫ్లాపులు తిన్నాడు. ‘జీరో’లో ఈ కింగ్ ఖాన్ మనోడు పెద్ద ప్రయోగమే చేయబోతున్నాడు. షారుక్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుంచి మొదటి పాట విడుదలైంది. ‘మేరే నామ్ తూ...’ అంటూ సాగే ఈ పాటను వీల్‌ఛైర్‌కే పరిమితమైన అనుష్క శర్మ, షారుక్ మధ్య చిత్రీకరించారు. పాట మొదట్లోనూ కళ్లల్లో ప్రేమను ఒలికిస్తూ ఈ స్టార్స్ పండించిన నటన హైలెట్‌గా నిలుస్తోంది. ఇద్దరి మధ్య ప్రేమకి ప్రతిబింబంగా రంగుల్లో షారుక్‌ను నింపేసి చిత్రీకరించిన ఈ పాటను ఇప్పటికే 8 మిలియన్ల మంది చూడడం విశేషం. షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మాతగా వ్యవహారిస్తున్న ‘జీరో’ సినిమాకు అజయ్- అతుల్ ద్వయం సంగీతాన్ని అందిస్తున్నారు.

‘జీరో’ మూవీ ఫస్ట్ సాంగ్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...First published: November 23, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>