ZEE5 NEW WEB SERIES LAVANYA TRIPATHI AADI SAIKUMAR PULI MEKA STARTED HERE ARE THE DETAILS SR
ZEE5 : లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ ప్రధాన పాత్రల్లో ZEE5లో కొత్త వెబ్ సిరీస్..
Zee5 new web series Puli Meka Photo : Twitter
ZEE5 : కంటెంట్ పరంగా చూస్తే ఎన్నో మిలియన్ల మంది హృదయాల ఆదరణతో దూసుకుపోతుంది ZEE5. ఒక జోనర్ కు మాత్రమే పరిమితం కాకుండా, వివిధ ఫార్మాట్లకు ప్రసారం చేసే విధంగా సినిమా, వెబ్ సిరీస్ ఇలా అన్ని రకాల జోనర్స్ ను వీక్షకులకు అందించనుంది.
ZEE5 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా అందిస్తుంది. ZEE5 ప్రారంభం నుండి ఒక ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ZEE5 కంటెంట్ పరంగా చూస్తే ఎన్నో మిలియన్ల మంది హృదయాల ఆదరణతో దూసుకుపోతుంది..ZEE5 ఒక జోనర్ కు మాత్రమే పరిమితం కాకుండా, వివిధ ఫార్మాట్లకు ప్రసారం చేసే విధంగా సినిమా, వెబ్ సిరీస్ ఇలా అన్ని రకాల జోనర్స్ ను వీక్షకులకు అందించనుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ', అన్నపూర్ణ స్టూడియోస్ స్టేబుల్ నుండి 'లూజర్ 2', BBC స్టూడియోస్ మరియు నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ నుండి 'గాలివాన' , ఇటీవల 'రెక్కీ 'తో ZEE5 మంచి హిట్ ను అందుకుంది .ఇప్పుడు తాజాగా "పులి - మేక" (puli meka ) వెబ్ సిరీస్ ను లాంచ్ చేసింది ZEE5. కోన ఫిలిం కార్పోరేషన్ , చేస్తున్న మొట్టమొదటి వెబ్ సిరీస్ “పులి - మేక”. ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) , ఆది సాయికుమార్ (Aadi Saikumar), సుమన్ తదితరులు నటించడం విశేషం. గోపీచంద్ హీరో గా ‘పంతం’ చిత్రానికి దర్శకత్వం వహించిన కె చక్రవర్తి రెడ్డి మెగాఫోన్ పట్టారు.
ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ & ZEE5 వారు సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశం తో తెరకెక్కిస్తున్న 'పులి - మేక ’ వెబ్ సిరీస్ పూజ కార్యక్ర మాలు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంది. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన దర్శకుడు బాబీ క్లాప్ కొట్టగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు. పూజ కార్యక్రమాల అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ..ఈ మధ్య వెబ్ సిరీస్ లు కూడా సినిమాల తో పోటీ పడుతున్నాయి.మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా వెబ్ సిరీస్ లకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో సినిమా హీరోలు సైతం వెబ్ సిరీస్ లలో నటించడానికి ముందుకు వస్తున్నారు.
ఈ పులి - మేక వెబ్ సిరీస్ లలో లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సుమన్ తదితరులు నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ "పులి - మేక" వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే పోలీసు డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగే థ్రిల్లర్ కథ ఇది . పోలీస్ డిపార్టుమెంట్ లోని పోలీసులను టార్గెట్ చేసి ఒకరి తర్వాత ఒకరు చంపుతున్న ఒక సీరియల్ కిల్లర్ నేపథ్యంలో థ్రిల్లర్ అంశాలు మరియు ఆస్ట్రాలజీ తో మిళితమైన కథాంశం ఉండటం ఈ వెబ్ సిరీస్ కథలో ఉన్న ప్రత్యేకత ఇప్పటి వరకు వచ్చిన వెబ్ సిరీస్ లాగే ఇది కూడా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.