యూట్యూబ్ నుంచి ‘అమృతం’ సీరియల్ ఔట్.. చూడాలంటే ఇది కంపల్సరీ..

తెలుగు టెలివిజన్‌ చూసేవాళ్లకు ‘అమృతం’ సీరియల్‌ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా యూట్యూబ్ నుంచి ఈ సీరియల్‌ను పూర్తిగా తీసేసి..

news18-telugu
Updated: December 2, 2019, 1:00 PM IST
యూట్యూబ్ నుంచి ‘అమృతం’ సీరియల్ ఔట్.. చూడాలంటే ఇది కంపల్సరీ..
‘అమృతం’ (Facebook/Photo)
  • Share this:
తెలుగు టెలివిజన్‌ చూసేవాళ్లకు ‘అమృతం’ సీరియల్‌ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఎన్నో ఛానెల్స్‌ ఈ సీరియల్ ప్రసార హక్కులు కొని ప్రసారం చేస్తూనే ఉన్నాయి. ప్రసారం చేసినపుడల్ల ఈ సీరియల్‌కు భారీ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేవి.  ఎపుడు ప్రసారం చేసినా.. ‘అమృతం’ సీరియల్‌కున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ సీరియల్‌ను  కొంత మంది ప్రేక్షకులు యూట్యూబ్ వేదికగా చూస్తూనే ఉన్నారు. యూట్యూబ్‌లో ఒక్కో సీరియల్‌కు లక్షల్లో వ్యూస్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సీరియల్‌ను యూట్యూబ్ నుంచి మొత్తంగా తీసేస్తున్నారు. తాజాగా ఈ సీరియల్ హక్కులను జీ 5 డిజిటల్ మీడియా భారీ రేటుకు కొనుగోలు చేసింది. ఇక నుంచి ఈ సీరియల్ చూడాలనుకునే వాళ్లు జీ5 డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ఉచితంగానే  డిసెంబర్ 6 నుంచి వీక్షించవచ్చు.

First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు