Pawan Kalyan | Vakeel Saab : మహేష్ బాబు రికార్డ్‌ భద్రం.. నాలుగవ స్థానంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్..

Pawan Kalyan Photo : Twitter

Vakeel Saab : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ‘వకీల్ సాబ్’ ఇటీవల టీవీలో ప్రసారం అయిన సంగతి తెలిసిందే.

  • Share this:
    Vakeel Saab : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ‘వకీల్ సాబ్’ ఇటీవల టీవీలో ప్రసారం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 18న జీ తెలుగులో సాయత్రం 6 గంటలకు ప్రసారం కాగా.. దీనికి సంబంధించిన టీ ఆర్ పీ రేటింగ్స్ వచ్చాయి. వకీల్ సాబ్‌కు 19. 12 రేటింగ్స్ వచ్చాయి. ఇది రికార్డ్ రేటింగ్ అని చెప్పోచ్చు. అయితే జీ తెలుగులో ప్రసారం అయిన టాప్ టీ ఆర్ పీ రేటింట్స్ విషయానికి వస్తే.. మహేష్ బాబు శ్రీమంతుడు 22.54 రేటింగ్స్‌లో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ డీజే 21.7 రేటింగ్స్‌తో రెండవ స్థానంలో ఉంది. విజయ్ దేవరకొండ గీతా గోవిందం 20.8తో మూడవ స్థానంలో ఉండగా.. ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ నాలుగవ స్థానంలో ఉంది. వకీల్ సాబ్ హిందీ సినిమా పింక్‌కు తెలుగు రీమేక్‌గా వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్‌లో వచ్చాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటించింది. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో అనన్య,అంజలి, నివేదా థామస్, ప్రకాష్ రాజ్‌లు కనిపించారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలోనే కాకుండా అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలై అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇక్కడ మరో విషయం ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎక్కువ రేటింగ్ తెచ్చుకున్న సినిమాగా వకీల్ సాబ్ నిలిచిందని టాక్.


    ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. క్రిష్ జాగర్లమూడి సినిమాలో నటిస్తున్నారు. చారిత్రక నేపథ్యం లో ఈ హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాన్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంవత్సరం అంటే 2022 సంక్రాంతికి విడుదల కానుందని టాక్.

    ఈ సినిమాతో పాటు పవన్.. ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్.. అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకుభీమ్లా నాయక్ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఈ రెండు సినిమాలో పాటు పవన్ కళ్యాణ్ హరీష్ దర్శకత్వంలో సంచారి అనే సినిమాను చేయనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: