Home /News /movies /

ZEE TELUGU IS PAYING TRIBUTE TO ALL FRONTLINE WORKERS ON THE OCCASION OF INTERNATIONAL DANCE DAY SK

రియల్ హీరోస్.. కరోనా పోరాట యోధులకు జీ తెలుగు నృత్య నివాళి

రియల్ హీరోస్.. కరోనా పోరాట యోధులకు జీ తెలుగు నృత్య నివాళి

రియల్ హీరోస్.. కరోనా పోరాట యోధులకు జీ తెలుగు నృత్య నివాళి

కరోనా యుద్ధంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న యోధులకు సంఘీభావంగా ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా అద్భుతమైన కార్యక్రమాన్ని జీ తెలుగు రూపొందించింది.

  ప్రతీ మనిషిలో ఒక హీరో ఉంటాడు, సందర్భం వచ్చినప్పుడు ఆ హీరో బయటకు వస్తాడు. సినిమా డైలాగే అయినా ఇప్పుడు కరోనా విపత్తు సమయంలో మన కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్య, పోలీసు, మున్సిపల్, మీడియా సిబ్బంది అందరూ సూపర్ హీరోలే. వాళ్లంతా మన కోసం, భవిష్యత్ తరాల కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. అందుకే వాళ్లంతా ఇప్పుడు మన పాలిట రియల్ హీరోస్. వారి త్యాగాలు, కష్టాల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మనం చేయాల్సిందల్లా ఒక్కటే. ఇంట్లో ఉండడమే. అదే మనం వారికిచ్చే అద్భుతమైన గౌరవం. ఇప్పటికే మన జీ తెలుగు ప్రేక్షకులు ఇంట్లోనే ఉంటూ కరోనా నియంత్రణకు కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు జీ తెలుగు కూడా నేనుసైతం అంటూ ముందుకు వచ్చింది. కరోనా యుద్ధంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న యోధులకు సంఘీభావంగా ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించింది.

  జీ తెలుగుతో కలిసి నెంబర్ 1 కోడలు సీరియల్ నటి సుధా చంద్రన్, సూర్యకాంతం సీరియల్ నటుడు ప్రజ్వల్, తూర్పు పడమర సీరియల్ నటి జయా కవి… కరోనా నియంత్రణలో పోరాడుతున్న యోధులకు తమ మద్దతును ప్రకటించారు. ఈ ముగ్గురు మణికర్ణిక – ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమాలోని ‘విజయూభవ’ అనే పాటను ఇప్పటి సందర్భానికి తగ్గట్లుగా అద్భుతంగా రూపొందించారు. ఈ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఏప్రిల్ 29 నుంచి జీ తెలుగు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై అభిమానుల్ని ఎంటర్టైన్ చేయనుంది.

  ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా రూపొందించిన కార్యక్రమంపై సుధా చంద్రన్ మాట్లాడుతూ.. “నా దృష్టిలో డ్యాన్స్ నా జీవితం. ప్రతీసారి నా జీవితంలో ఉత్సాహాన్ని నింపుతూనే ఉంది. నా కాళ్లకు గజ్జెలు ఉన్నప్పుడే నేను ఈ లోకాన్ని విడిచిపెట్టాలని ప్రతీసారి దేవుడ్ని కోరుకుంటాను. ఇప్పుడు రూపొందించిన ఈ విజయీభవ.. కోవిడ్-19 పై జరుగుతున్న యుద్ధంలో పోరాడుతున్న ప్రతీ ఒక్కరికి అంకితమిస్తున్నాను. మనం మనుషులం, అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడటానికి అంతర్గత బలాన్ని ఇవ్వాలని కోరుకోవాలి. త్వరలో మంచి రోజులు కచ్చితంగా వస్తాయి. అప్పటివరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండండి .” అని అన్నారు.

  ఈ కార్యక్రమాన్ని మరింత ఎంటర్టైనింగ్గా మార్చేందుకు మరికొంత మంది తమ వంతు సహకారం అందించారు. అక్సా ఖాన్, రోషన్, జై చౌహాన్, మహాలక్ష్మి… మణికర్ణిక – ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమాలోని విజయీభవ పాటకు తమ డ్యాన్సును జోడించారు. ఇక రియల్ లైఫ్ జంట అయిన సిద్ధార్థ్ వర్మ-విష్ణు ప్రియ.. సఖి సినిమాలోని నగిన పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. రక్త సంబంధం ఫేమ్ జ్యోతిరెడ్డి.. స్వర్ణకమలం సినిమాలోని కొలువై ఉన్నాడే పాటకు అద్భుతంగా నర్తించి మెప్పించారు. ఇక కార్యక్రమానికే హైలెట్ జెంటిల్‌మేన్ సినిమాలోని కొంటెగాడ్ని కట్టుకో పాట. ఈ పాటను తమ పిల్లలతో కలిసి యాంకర్లు అయిన లాస్య, శ్యామల, రవి… అదిరింది ఫేమ్ ధనరాజ్, వేణు అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు.

  అద్భుతమైన పర్ఫార్మెన్స్లతో కూడిన ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే రోజు ఏప్రిల్ 29న అభిమానుల కోసం ప్రసారం చేస్తోంది జీ తెలుగు
  రండి.. జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్డీ ఛానల్స్‌తో కలిసి కరోనాపై పోరాడుతున్న సూపర్హీరోస్కి సంఘీభావం తెలుపుదాం. ఈ అంతర్జాతీయ డ్యాన్స్ డే సందర్భంగా వారి సేవలను స్మరించుకుందాం. బాధ్యతగల ఛానల్‌గా ప్రేక్షకుల్ని జీ తెలుగు కోరుతోంది ఒక్కటే.. ఇంట్లోనే ఉండండి.. క్షేమంగా ఉండండి. ఎందుకంటే మనం ఇంట్లో ఉంటేనే కరోనా బయటకు వెళ్లిపోతుంది కనుక. ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగు సబ్ స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి. జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కుచెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి. నెలకు కేవలం 20 రూపాయలకు మీకుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదాకేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

  జీ తెలుగు గురించి
  జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEl)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు. 2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానెల్ తో సౌతిండియాలో ఎంటరైంది సంస్థ. దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు. ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది. విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.. అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు. సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు. అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది. ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

  ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగు సబ్ స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే. మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి. జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కుచెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి. నెలకు కేవలం 20 రూపాయలకు మీకుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదాకేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Corona virus, Coronavirus, Covid-19, Tollywood, Zee5

  తదుపరి వార్తలు